Guntur Kaaram: ఆ హీరో రిజెక్ట్ చేసిన కథతోనే గుంటూరు కారం తెరకెక్కుతోందా?

Guntur Kaaram: సాధారణంగా దర్శకులు రచయితలు కొందరు హీరోలను దృష్టిలో పెట్టుకొని సినిమా కథలు రాస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ హీరోలకు ఆ సినిమా కథ నచ్చకపోవడంతో ఆ సినిమాలను రిజెక్ట్ చేయడం ఆ సినిమాల్లోకి వేరే హీరో ఇంట రావడం జరుగుతుంది. ఇలా ఆ సినిమాలు కనుక సూపర్ హిట్ అయితే పలు సందర్భాలలో హీరోలు దర్శకులు ఈ సినిమాకు ముందుగా ఫలానా హీరోని అనుకున్నాము అని చెబుతూ ఉంటారు.

ఇలా సూపర్ హిట్ సినిమాని తమ అభిమాన హీరో మిస్ చేసుకున్నారనే విషయం తెలిస్తే అభిమానులు తెగ బాధపడుతూ ఉంటారు. ఇలా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసినటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారని చెప్పాలి.ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ కనుక బయటకు తీస్తే ఆ అభిమానులు ఎందుకు ఈ సినిమాలను మిస్ చేసుకున్నారా అని బాధ పడాల్సిన సందర్భాలు తప్పకుండా వస్తాయని చెప్పాలి.

 

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం గుంటూరు కారం. కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా మహేష్ బాబును మాస్ లుక్ లో కనిపించబోతున్నారు.

 

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్, గ్లింప్ కనుక చూస్తే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. ఇక పోతే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కథకు ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్నారట. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాలోనే నటించాల్సి ఉంది. ఈ సినిమా కథనం ఎన్టీఆర్ కి చెప్పగా కొన్ని మార్పులు చెప్పారట ఇలా మార్పులు చేసి కూడా ఎన్టీఆర్ వద్దకు వెళ్లడంతో ఈ సినిమా నచ్చలేదని రిజెక్ట్ చేయడంతోనే తిరిగి మహేష్ బాబు ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా కథను వదులుకొని తప్పు చేశారా అన్న ఆలోచనలో అభిమానులు కూడా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -