Balayya: బాలయ్యలో వచ్చిన మార్పు వెనుక ఉన్నది ఆయనేనా?

Balayya: సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు నందమూరి నటసింహం బాలయ్య. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో పోటీగా మాస్ సినిమాలు చేస్తున్నారు. అయితే బాలయ్య ఖాతాలో ఇండస్ట్రీ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. సీనియర్ హీరోలకు కాలం చెల్లిందనుకునే సమయంలో.. తన ఇమేజ్‌ను కరెక్టుగా వాడుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టొచ్చని బాలయ్య ప్రూవ్ చేశాడు. బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి డైరెక్షన్లలో సినిమాలు చేస్తూ బాలయ్య తనంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కెరీర్ పరంగా పూర్తిగా డౌన్‌లో ఉన్న బాలయ్యను.. బోయపాటి శ్రీనే కాపాడారు. బాలయ్య ఇమేజ్‌ను కరెక్టుగా వాడుకుని బ్లాక్ బస్టర్ హిట్లు అందించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే.. తప్పనిసరిగా హిట్ అన్నట్లు బయట టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు బోయపాటి లేకపోతే బాలయ్య లేనట్లు పుకార్లు వినిపించేవి. కానీ ఆ టైమ్ మారిందని చెప్పవచ్చు.

 

 

ఒకప్పటి ఫామ్, క్రేజ్‌ను బాలయ్య కొనసాగిస్తున్నారని, దానికి కారణం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కారణమని సమాచారం. అయితే చిరంజీవి-చరణ్‌లను పక్కన పెట్టి.. అల్లు అరవింద్.. బాలయ్యతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య సినిమాల సెలక్షన్ విషయంలోనూ అల్లు అరవింద్ ఇన్వాల్ అవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు అల్లు అరవింద్.. చిరంజీవి-రామ్ చరణ్‌ల సినిమా స్టోరీలు ఫైనల్ చేసేవారు. అప్పుడే సినిమా సెట్స్ పైకి వెళ్లేది. కానీ ఇప్పుడు వీరిద్దరి విషయంలో అల్లు అరవింద్ దూరంగా ఉంటున్నారని, తన సపోర్ట్ మొత్తం బాలయ్యకే ఇస్తున్నారని సమాచారం.

 

 

బాలయ్య సినీ కెరీర్‌లో పెద్దగా సంపాదించుకుంది లేదు. సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. నిర్మాతలకు ఫేవర్‌గా ఉండాలనే తండ్రి మాటను జవదాటి వెళ్లేవారు కాదు. సినిమా పెద్ద హిట్ అందుకున్నా.. రూ.8 కోట్ల పారితోషికం వరకే ఆగిపోయేవారట. యాడ్స్ కూడా చేసేవారు కాదు. కానీ ఇప్పుడు బాలయ్య తన క్రేజ్‌ను పూర్తిగా వాడుకుంటున్నారు. కమర్షియల్ యాడ్స్ చేయడంతోపాటు.. సినిమాల్లో పారితోషికం కూడా పెంచారని, ఒకవేళ సినిమా హిట్ అయితే అందులో వాటా కూడా అడుగుతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. ఈ మార్పుకు కారణం అల్లు అరవింద్ అని టాక్ వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -