NTR-Hrithik Roshan: తారక్, హృతిక్ రోషన్ లలో బెస్ట్ డ్యాన్సర్ అతనేనా?

NTR-Hrithik Roshan: టాలీవుడ్ లో డాన్స్ బాగా చేయగల యాక్టర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారంటంలో ఎలాంటి సందేహము లేదు. అలాగే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ బెస్ట్ డాన్సర్ అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో నడుస్తున్న డిస్కషన్ కూడా ఇదే.

టాలీవుడ్ లో ఎఫర్ట్ లెస్ గా డాన్స్ వేయగల ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా భయపడుతూ ఉంటారు ప్రాక్టీస్ కూడా చేయకుండా ఎన్టీఆర్ అంత ఈజీగా స్టెప్స్ ఎలా వేస్తాడు అని డాన్స్ మాస్టర్స్ సైతం ఇంటర్వ్యూలలో చెప్తూ ఉంటారు. సినిమాల్లోకి రాకముందే అతను కొన్ని వందల స్టేజి షోలు ఇచ్చాడు.

 

అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కి ఇంతవరకు స్క్రీన్ పైన పోటీ లేదు కానీ ఈసారి మాత్రం అతనికి సమఉజ్జి అయినా మరొక స్టార్ హీరోతో పోటీ పడాల్సి వస్తుంది. ఇంతకీ ఎవరో హీరో అనుకుంటున్నారా బాలీవుడ్ గ్రీక్ గార్డ్ గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్. బాలీవుడ్ లో డాన్స్ కి హెరితిక్ రోషన్ కేర్ ఆఫ్ అడ్రస్. స్మూత్ గా మంచి ఈజ్ తో డాన్స్ చేయటం హృతిక్ నైజం.

 

అందుకే హృతిక్ రోషన్ డాన్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా జరిగిన హైఫా అవార్డ్స్ ఈవెంట్ లో కహోనా ప్యార్ హై సినిమాలోని ఎక్ పల్ కా జీనా సాంగ్ కి డాన్స్ ఇరగదీసాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పటినుంచి హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ కనిపిస్తాడా అనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ లాగే హృతిక్ రోషన్ కూడా డాన్స్ లో పోటీ ఇచ్చేవారు లేరు బాలీవుడ్ లో.

 

అయితే వీరిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనేది తెలియాలి అంటే 2025 వరకు ఆగాల్సిందే ఎందుకంటే వీరిద్దరూ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ అప్పుడే రిలీజ్ అవుతుంది. ఈ ఇద్దరు ఫేస్ ఆఫ్ డాన్స్ తో ఒక్క సాంగ్ పడితే బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -