Sai Pallavi: సాయిపల్లవిని పెళ్లి చేసుకునే లక్కీ పర్సన్ అతనేనా?

Sai Pallavi: సాయి పల్లవి ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే తెలుగులో మాత్రం ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాలో ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.అందరి హీరోయిన్స్ మాదిరిగా సాయి పల్లవి వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకొని అలాంటి సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

అవకాశాలు వచ్చిన తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా సినిమాలలో గ్లామర్ షో చేయాల్సి వచ్చిన ఈమె ఎలాంటి స్టార్ హీరో అయినా కూడా నిర్మొహమాటంగా సినిమాలలో నటించడానికి నో చెబుతుంది.ఇలా గ్లామర్ షో కి తావు లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సాయి పల్లవి భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది.

 

సాయి పల్లవి వైద్య విద్యను అభ్యసించిన విషయం మనకు తెలిసిందే. ఈమె తన వైద్య విద్యను పూర్తి చేశారు. అయితే సినిమాలపై ఉన్న మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎప్పుడైతే తనకు గ్లామర్ షో తప్పనిసరిగా చేయాలి అనిపిస్తే అలాంటి సినిమాలు చేయనని ఒకవేళ గ్లామర్ షో చేస్తేనే అవకాశాలు ఇస్తామని చెబితే తాను సినిమా ఇండస్ట్రీకే దూరమవుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇండస్ట్రీకి దూరమై తాను తన వైద్య వృత్తిలో స్థిరపడతానని సాయి పల్లవి వెల్లడించారు.

 

ఇకపోతే సాయి పల్లవి 1992 మే 09 వ తేదీ జన్మించారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో తన కుటుంబ సభ్యులు తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగినది చాలని పెళ్లి చేసుకొని తన జీవితంలో స్థిరపడమని తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ సాయి పల్లవి మాత్రం సినిమాలపైనే ఆసక్తి కనబరుస్తున్నారట ఇకపోతే తన కుటుంబ సభ్యులు సాయి పల్లవి కోసం ఓ సంబంధం తీసుకు వచ్చినప్పటికీ ఈమె మాత్రం ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -