Pawan Kalyan-Jr NTR: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లలో నంబర్ వన్ హీరో అతనేనా?

Pawan Kalyan-Jr NTR:  సినీ ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు ఎంతో ప్రత్యేకం. మెగా-నందమూరి ఫ్యామిలీ అంటే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ ఇష్యూగానే ఉంటుంది. దానికి తగ్గట్లే వీరి అభిమానులు కూడా.. ‘మా హీరో అంటే.. మా హీరో’ అని తెగ పొగిడేస్తూ ఉంటాయి. ఈ ఫ్యామిలీలకు చెందిన హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు మాత్రం అందరిలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడా పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గొడవలు లేవని మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీని పొగడ్తలతో ముంచెత్తుతున్న వార్తలు ఇటీవల హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవల జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయింది. ఈ క్రమంలో మెగా, నందమూరి ఫ్యామిలీ ప్రయోషన్‌లో పాల్గొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూ మాట్లాడారు. అలాగే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా ఏపీకి సీఎంగా అయితే చూడాలని అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.

అయితే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ రూటే సపరేట్. సినీ ఇండస్ట్రీలో వీరిద్దరికి ఉండే క్రేజ్, మాస్ ఫాలొయింగ్ కూడా ఎక్కువే. ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేగం పెంచారు. టైం దొరికినప్పుడల్లా సినిమాలు చేయడం.. లేదా ప్రజా సేవలో బిజీగా ఉండటమే పనిగా పెట్టుకున్నారు.

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోలు ఎవరున్నారనే విషయంపై సర్వే జరిగింది. ఈ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. అయితే పలు సర్వేల్లో ఈ ఇద్దరు హీరోలలో ఎన్టీఆర్ పవన్ కంటే ముందు వరుసలో ఉన్నారని, క్రేజ్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -