Sadha: సదా పెళ్లి చేసుకోకపోవడానికి కారణమైన వ్యక్తి అతనేనా?

Sadha: దర్శకుడు తేజ ఇండస్ట్రీకి ఎంతోమంది నటీనటులను పరిచయం చేశారు. ఇలా ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వారు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకొని స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఇలా దర్శకుడు తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వారిలో నితిన్ సదా ఒకరు వీరిద్దరి కాంబినేషన్లో జయం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఇద్దరు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటు స్టార్ట్ హీరోగా కొనసాగుతుండగా సదా కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో కొంతకాలం పాటు స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో సదా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సదా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 

ఇక సదా పెళ్లి వయసు దాటిపోయినప్పటికీ ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అయితే పెళ్లి గురించి తనని ప్రశ్నించడంతో ఇప్పటివరకు తన సంపాదన పై ఆధారపడకుండా తనని పోషించేవాడు తనకు ఎదురు పడలేదని అలా ఎదురుపడినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ ఈ విషయాన్ని దాటవేశారు. అయితే సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఓ కారణం ఉందని ఇండస్ట్రీలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.

 

ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఓ హీరోతో ప్రేమలో పడిందని వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో కూడా నటించారని తెలుస్తోంది. అయితే ఇలా హీరోతో ప్రేమలో ఉన్నటువంటి సదాను ఆ హీరో దారుణంగా మోసం చేయడంతో ఈమె పెళ్లి విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకుందని తను ఈ జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇలా సదా ఆ హీరో కారణంగానే ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తుంది. మరి సదా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -