Chiranjeevi Vs Mahesh Babu: చిరంజీవి, మహేష్ బాబులలో విజేతగా నిలిచేది అతనేనా?

Chiranjeevi Vs Mahesh Babu: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ దూకుడు కనపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన తన తదుపరిచిత్రం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తమిళ సూపర్ హిట్ సినిమా వేదాలం సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా నటి కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కాబోతుంది అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ కు పెద్దగా ఆదరణ రాలేదని తెలుస్తోంది.

 

ఇకపోతే చిరంజీవి భోళా శంకర్ విడుదల అయ్యే రోజున మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా విడుదల కాబోతుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ తేదీని నిర్మాత నాగ వంశీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయకపోయినా విడుదల తేదీని కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఈ విధంగా మహేష్ బాబు చిరంజీవి ఇద్దరు ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నారు.

 

ఇలా ఇద్దరి హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతుండగా ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే చరిష్మా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కచ్చితంగా అతని సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సొంతం చేసుకునే హీరోగా ఉన్నారు.అయితే మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ విషయం గురించి మహేష్ బాబు నిర్మాతకు ఒక విషయం కూడా చెప్పలేదని సమాచారం ఇండస్ట్రీలో వినపడుతుంది. అయితే వీరిద్దరూ కలిసి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతారా లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -