Ram Charan: మెగాస్టార్ కొడుకు కావడమే రామ్ చరణ్ కు వరమైందా?

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి మంచి హిట్ లు సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోగా వరుస అవకాశాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు సొంతం చేసుకున్నాడు.

 

ఇక ఈయనే కాకుండా ఈయన వారసుడు రామ్ చరణ్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాడు. అప్పటివరకు స్టార్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తండ్రి హోదాతో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించిన సంగతి తెలిసిందే. నిజానికి రామ్ చరణ్ నటన కంటే ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఎక్కువగా ఫిదా అయ్యారు. సినిమా తర్వాత చాలామంది ఎన్టీఆర్ కే మార్కులు వేశారు.

 

ఇక అది రామ్ చరణ్ కి కూడా కాస్త ప్లస్ గా మారింది. అయితే ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులు సొంతం చేసుకోగా.. రీసెంట్ గా ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ అవార్డు అందుకున్న సందర్భంలో అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ బాగా నినాదాలు సృష్టిస్తున్నారు.

 

అయితే కొందరు రామ్ చరణ్ ను ఉద్దేశించి బాగా కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ కు ఈ గుర్తింపు రావడం కారణం మెగాస్టార్ చిరంజీవి అని.. చిరంజీవి కొడుకు కావడం వల్లే చరణ్ స్టార్ హీరో అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చిరంజీవి కొడుకు కావడం వల్లే చరణ్ కు వరమైందని నెటిజన్లు అంటున్నారు. అంటే ఒకవేళ చిరంజీవి కొడుకు కాకుంటే రామ్ చరణ్ స్టార్ హీరో అయ్యేవారు కాదా అంటూ మరికొంతమంది అనుమానం పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -