Ananya Nagalla: అది తక్కువగా ఉండటమే అనన్యకు మైనస్ అయిందా?

Ananya Nagalla: అనన్య నాగళ్ల పేరు చాలా మందికి తెలియకపోవచ్చుగానీ వకీల్ సాబ్ లో ఓ హీరోయిన్ అంటే మాత్రం కొందరు గుర్తు పడతారు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా నటించిన వకీల్ సాబ్ లో ఈ ముద్దుగుమ్మ ఓ సైలెంట్ క్యారెక్టర్ లో కనిపించింది. వకీల్ సాబ్ సినిమాతో అనన్య నాగళ్లకు మంచి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. అయితే ఆ సినిమా తర్వాత అంతగా హిట్లు మాత్రం లేవు. అందుకేనేమో ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

 

ఎప్పుడూ సోషల్ మీడియాలో అనన్య యాక్టీవ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రెండీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. అయితే ఈమె స్టార్ హీరోయిన్ ఎందుకు కాలేకపోతోందంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అటు అందం, ఇటు నటన ఉన్నా ఈమెకు ఎందుకు సినిమాలు కలిసిరావడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు. మంచి క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ అయిన స్టార్ హీరోయిన్ గా అనన్య నాగళ్ల ఎందుకు ఎదగలేకపోతోందంటూ చర్చించుకుంటున్నారు.

అయితే అనన్య నాగళ్ల వయసే ఆమెకు కొంత మైనస్ గా మారిందని కొందరు అనుకుంటున్నారు. లుక్స్ పరంగా ఆమె అందర్నీ ఆకట్టుకుంటున్నా చూడటానికి ఆమె చాలా చిన్న పిల్లలా ఉంటుందట. కుర్ర హీరోలతో, పెద్ద హీరోలతో ఆమె హీరోయిన్ గా చేయడానికి అస్సలు సెట్ కాదని అంటున్నారు.

 

ఇప్పుడిప్పుడు వస్తున్న హీరోలతో సినిమా అవకాశాలు వస్తున్నా ఆమె రిజెక్ట్ చేస్తుందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా సరే అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు అనన్య పరిస్థితి తయారైంది. అందం ఉన్నా సరే అవకాశాలు రావట్లేదని ఆమె మాత్రం ఖాళీగా ఉండటం లేదు. ఫోటో షూట్స్ తో తన ప్రతిభను వెలికితీస్తోంది. అనన్యకు ఇకపై మరిన్ని అవకాశాలు రావాలని, ఆమె స్టార్ హీరోయిన్ కావాలని ఆశిద్దాం.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -