YCP: జగన్ సర్కార్ కారణంగా వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుతం ఏడుపే మిగిలింది. ప్రజల సంగతి కాసేపు పక్కన పెడితే వైసీపీ నేతలు కూడా ఏడుస్తున్నారు. సర్వ నాశనం అయిపోయాము అంటూ గుండెలు బాధ కుంటున్నారు. పైకి కనిపిస్తూ తమ బాధను వ్యక్తపరుస్తూ ఏడ్చే నేతలు కొంతమంది అయితే ఇంటికి వెళ్లి మరి గుండెలు బాధపడుతూ ఏడ్చే నేతల సంఖ్య ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. అలా ఏడ్చే వారు కిందిస్థాయి కార్యకర్త నుండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వరకు ఉన్నారు.
ఉన్నదంతా ఊడ్చుకుని గెలిపిస్తే ఇలా చేశావు అంటూ చాలామంది నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు ఇలా ఏడవడం విచిత్రమే అని చెప్పినా కూడా చేసుకున్నోనికి చేసుకున్నంత అని చెప్పవచ్చు. చాలామంది వైసిపి నేతలు చేసేదేమి లేక నోరు మెదపలేక వారి చెప్పుతో వారు కొట్టుకున్నట్లు పరిస్థితి కూడా ఎదురవుతోంది. జగన్ చెప్పిన మాటలు విని కింది స్థాయి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు తమ సొంత సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. జగన్ ను గెలిపించారు. ఈ నాలుగేళ్లలో వాళ్లకు మిగిలింది మాత్రం చిప్పే. మన ప్లేట్ అంటూ ఇచ్చారు.
కానీ చివరికి బిర్యానీ కాదు కదా ప్లేట్ లో మట్టి పెళ్లలు కూడా లేకుండా చేశారు. పనులు చేయించి బిల్లులు ఇవ్వట్లేదు. దీంతో వారంతా చెప్పులతో కొట్టుకుంటున్నారు. వారంతా మరెవరో కాదు అందరు వైసీపీ నేతలే. మొన్నటికి చిత్తూరులో ఒక జడ్పీటీసీని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో చూసిన తర్వాత వైసీపీ నేతలకు ఒక క్లారిటీ వచ్చేసింది. తాము కూడా నోరు ఎత్తితే వారికి కూడా అదే ట్రీట్మెంట్ అన్న విషయం బాగా అర్థమైంది. సీఎం జగన్ కూడా పార్టీ నేతలు అందరినీ తమ వారిగా చూడటం పక్కన పెట్టి ఒక వర్గం మాత్రమే తనతో ఉంటుందని మిగతా వారందరూ పార్టీ వారే అన్నట్లుగా భావిస్తున్నారు. దాంతో బాలినేని వంటి వాళ్లకు ఏడుపే మిగులుతోంది.
ఏపీలో ఒకవైపు ఓట్లేసిన ప్రజలూ ఏడుస్తున్నారు. జగన్ కు ఓట్లేసిన దిగువ మధ్యతరగతి జనాల్ని మద్యం రేట్లు పెంచి పీల్చి పిప్పి చేసేశారు. వారికి రేషన్ బియ్యం తప్ప దిక్కులేని పరిస్థితికి తెచ్చారు. ఇళ్ల పేరుతో అప్పుల పాలు చేశారు. ఉపాధి లేకుండా చేశారు. ఇప్పుడు ఆ జగన్ ఓటు బ్యాంక్ మొత్తం దీనావస్థలో ఉంది. వారు నిరుపేదలు కాబట్టి వారి ఏడుపులు ఎవరికీ పట్టడం లేదు. ఇక ప్రభుత్వ విధానాలతో సగం ప్రజల జీవితం నాశనమైపోయింది. దీంతో ఏపీలో చాలామంది ప్రజలు మాత్రమే కాకుండా వైసిపి నేతలు కూడా మళ్లీ జగన్ సర్కారు రాకూడదని కోరుకుంటున్నారు.