Rajamouli: ఆ రీజన్ వల్లే జక్కన్న అమెరికాలో ఇల్లు తీసుకున్నారా?

Rajamouli: ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ నే కాకుండా ఇతర భాషకు చెందిన ఇండస్ట్రీలను కూడా ఒక ఊపు ఊపాడు. కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు ప్రతి సక్సెస్ ను వెనుకకు వేసుకున్నాడు. ఇక ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమాతో మాత్రం రెట్టింపు క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రెట్టింపును మరింత రెట్టింపు చేసుకోగా తాజాగా వచ్చిన ఆస్కార్ అవార్డుతో అందర్నీ గర్వించేలా చేశాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ఆయన అమెరికాలో ఇల్లు తీసుకున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రాజమౌళి హాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

 

అందుకే ఆయన లాస్ ఏంజెల్స్ లో ఓ అద్దె ఇల్లు తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్, అవార్డు కోసం రాజమౌళి అమెరికాకు చాలా సార్లు వెళ్లి వచ్చాడు. అంతేకాకుండా అక్కడి నిర్మాణ సంస్థలతో కూడా చర్చలు జరిపినట్లు తెలిసింది. పైగా ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

అయితే ఆ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి పని చేయనున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రతిసారి హోటల్స్ లో ఉండడానికి కష్టమవుతుందని అనుకున్నాడో ఏమో.. అందుకే అమెరికాలో రేంటెడ్ హౌస్ తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఆ ఇంట్లోనే సెలబ్రేషన్స్ జరుపుకున్నట్లు తెలిసింది. ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -