Prabhas: వాళ్ల వల్లే ప్రభాస్ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా?

Prabhas: డార్లింగ్ ప్రభాస్ కు గతేడాది ఏమాత్రం కలసిరాలేదు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. వందల కోట్లు పోసి తీసిన సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ప్రభాస్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. తన స్నేహితులతో కలసి ఏర్పాటు చేసిన యూవీ క్రియేషన్స్ లో తీసిన సినిమా కావడం, భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడంతో నష్టాలను ప్రభాస్ కూడా భరించాల్సి వచ్చింది.

 

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పెదనాన్న కృష్ణంరాజు కన్నుమూయడం కూడా ప్రభాస్ ను తీవ్రంగా కలచి వేసింది. ఈ బాధ నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో తాను తీస్తున్న షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మిగతా సినిమాల చిత్రీకరణలను కూడా పూర్తి చేసే పనుల్లో ఉన్నారు.

 

స్నేహం కోసం ఏదైనా చేస్తారా?
పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో ప్రభాస్ రీసెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షో ‘ఆహా’లోకి రాగానే.. మొత్తం యాప్ క్రాష్​ అయిపోయింది. ప్రభాస్ క్రేజ్ అలాంటిది మరి. దీని తర్వాతి ఎపిసోడ్ ఈ నెల 6వ తేదీన స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇకపోతే, ప్రభాస్ యూవీ క్రియేషన్స్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

 

స్నేహితులు నడిపిస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ కోసం ప్రభాస్ అప్పులు కూడా చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. నమ్మిన మిత్రులు తీస్తున్న మూవీస్ కోసం డార్లింగ్ అప్పులు చేస్తున్నారని.. తన వంతు సహాయసహకారాలను కూడా అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభాస్ నిజంగా చాలా గ్రేట్ అంటూ ఆయన అభిమానులతోపాటు నెటిజన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి, నిజంగానే స్నేహితుల కోసం ప్రభాస్ అప్పుల్లో కూరుకుపోయారా అనే విషయంలో నిజానిజాలు ఆయనకే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -