Rayalaseema: బాబు చెప్పిన విధంగా రాయలసీమ రాత మారడం ఖాయమేనా?

Rayalaseema: ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఇరు పార్టీ వాళ్లు అన్ని విధాలుగా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అయితే టీడీపీ కూడా వాళ్ల ప్రయత్నాలను సాగిస్తుంది. చంద్రబాబు నాయుడు కొడుకు అయినా నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కుప్పంలో మొద‌లు పెట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర త్వ‌ర‌లో క‌డ‌ప‌లో పూర్తి చేసుకోవ‌డం ద్వారా సీమ అంత న‌డిచిన‌ట్టు అవుతుంది.

 

సీమలో తన పాదయాత్ర పూర్తయ్యేలోగా ఆ ప్రాంత అభివృద్ధి ప్రకటనను విడుదల చేస్తాము అని లోకేష్ ప్రకటించారు. అయితే ఆ సమయం రానే వచ్చింది రాయలసీమలో ఉపాధి లేక ప్రజలు వేరే ఊళ్ళకి వలస వెళ్తున్నారని చదువుకున్న వాళ్లకు సరైన ఉద్యోగాలు ఇక్కడ ఉండకపోవడంతో వేరే రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.

అలాగే ప్రజలకు తాగునీరు సాగునీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నారని ఈసారి ఓట్లను టిడిపి వాళ్ళకి వేస్తే ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టి వీటికి మంచి పరిష్కారం ఇస్తాము అని కూడా వెల్లడించారు లోకేష్. కాకపోతే ఇక్కడ అందరికీ తెలిసిన విషయమేంటంటే, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు అన్ని అలాగే ఉన్నాయి.

 

అప్పుడు తీర్చలేని వాళ్ళు ఈసారి ఎలా తీరుస్తారు అయినా అందులో తాగునీళ్లు సాగునీళ్ళు లేకపోవడానికి కారణం కూడా టిడిపి అధ్యక్షులే అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అందుకే వాళ్ళ జవాబును కిందటిసారి ఓట్లతో తెలిపారు ఇలా మాటలకే కాదు చేతులకు కూడా ఏమైనా పని చెప్తే అప్పుడే ఓట్లు వస్తాయి లేకపోతే ఈసారి కూడా అధికారం పార్టీలోకి రావడం కష్టమే.

 

ముందు జరిగిన నష్టాన్ని తీరిస్తే తర్వాత భవిష్యత్తులో చేయాల్సిన పనులు గురించి ఆలోచించొచ్చు అని ప్రజలు చెప్తున్నారు. నాశనం చేసిన వాళ్ళే తిరిగి ఉద్ధరిస్తామంటూ మాట్లాడుతుంటే వినడానికి చాలా హాస్యంగా ఉన్నది. వీలు అధికార పార్టీలో ఉన్నప్పుడు సిద్దేశ్వ‌రం అలుగు నిర్మిస్తే సీమ స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌ని ఉద్య‌మాలు చేస్తే, అణ‌చివేత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది చంద్ర‌బాబు కాదా?

 

దివంగ‌త వైఎస్సార్ చొర‌వ చూప‌క‌పోతే పోతిరెడ్డిపాడు కాలువ వెడ‌ల్పునకు నోచుకునేదా?సీమ‌కు తాగు, సాగునీళ్లు ఇవ్వొద్దంటూ టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌రరావు ప్ర‌కాశం బ్యారేజీ మీద ఆందోళ‌న‌కు దిగితే, ఇదే చంద్ర‌బాబునాయుడు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వాస్త‌వం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి.
ఇన్ని చేసినా సరే ఇంకా ఉద్ధరిస్తాము అంటే నమ్మడానికి ప్రజలు ఆట బొమ్మలు కాదు. ఒకసారి నమ్మి మోసపోయిన తర్వాత మరోసారి నమ్మరు కూడా.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -