Polavaram: కేంద్రం నిర్ణయంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం ఖాయమేనా?

Polavaram: వైయస్ జగన్ కు ఈ మధ్యకాలంలో అన్ని బాగా కలిసొస్తున్నాయి. అన్ని విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంలో రావాల్సిన లోటు బ‌డ్జెట్ కింద ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్ల‌కు పైగా నిధుల్ని కేంద్రం అంద‌జేసింది. దాంతో గ‌తంలో చంద్ర‌బాబు నాయుడుకు సాధ్యం కానిది, ఇప్పుడు జగన్ కు సాధ్యమైనట్టయ్యింది. తాజాగా ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి మ‌రో తీపి క‌బురు అందింది.

అదేమిటంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి 17,414 కోట్ల రూపాయలు అడ్‌హ‌క్ నిధులు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ మధ్యే కేంద్రం 10 వేల కోట్ల రూపాయలు ఆర్థికలోటు బకాయిలు విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా వాస్త‌విక దృక్పథంతో కాకుండా రాజకీయ కోణంలో చర్చ జరుగుతోంది. పోలవరం తాకట్టు పెట్టి 10 వేల కోట్లు తీసుకొచ్చారని విమర్శలు చేశారు. ఇప్పుడు పోలవరానికి అడ్‌హ‌క్ కింద 17,414 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడంతో పోలవరం ఎత్తు మట్టం కుదింపు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

 

ఏపీ నీటి అవసరాలను తీర్చేది ప్రధానంగా గోదావరి , కృష్ణా నదులు. కృష్ణ నీటిని మిగులు జలాలతో సహా పంపిణీ చేసిన నేపథ్యంలో అపారమైన నీటి లభ్యతకు అవకాశం ఉన్న గోదావరిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా డెల్టా , గోదావరి, విశాఖ నగర, పారిశ్రామిక అవసరాలకు గోదావరి నీరే ప్రధానం. అలా పోలవరం కీలక ప్రాజెక్టు అనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్ , గోదావరి, విశాఖనగర, పారిశ్రామిక అవసరాలకుగాను దాదాపు 360 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుత డిజైన్ 150 అడుగుల్లో 196 టీఎంసీల నీటి నిల్వ‌. కుడికాలవ కృష్ణా డెల్టా, ఎడమ కాలువ గోదావరి, విశాఖ అవసరాలు. ఈ కాల్వల ద్వారా 360 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇక్కడే కీలక విషయాన్ని పరిశీలన చేయాలి. 196 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేసి అందులో డెడ్ స్టోరేజ్ పోను అవకాశం ఉన్నది దాదాపు 150 టీఎంసీలే. మరి 360 టీఎంసీల నీరు ఎలా తీసుకుంటారు? పోలవరం అనేది నాగార్జున సాగర్, శ్రీశైలం లాగా నిల్వ ఉంచిన నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు కాదు. గోదావరి 120 రోజులు ప్రవాహం ఉంటుంది. కనుక గ్రావిటీతోనే కుడి, ఎడమ కాల్వలకు నీరు డ్రాచేసుకునే అవకాశం ఉండే విధంగా ఎత్తుమట్టం ఉంటే సరిపోతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -