Rajamouli-Mahesh: ఆ పరీక్షను మహేష్ బాబు పాస్ కావడం సాధ్యమవుతుందా?

Rajamouli-Mahesh: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర సినిమా గత ఏడాది విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇకపోతే రాజమౌళికి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఒక సినిమా రూపొందించే ముందు ఒక పక్కా ప్లానింగ్ తో ఉంటారు రాజమౌళి. ఇక రాజమౌళి సినిమా అంటే అవతల స్టార్ హీరో అయిన టెక్నీషియన్ అయిన ఎవరైనా కూడా జక్కన్న మాట వినాల్సిందే. రాజమౌళి నిర్వహించే వర్క్‌ షాప్‌కు అందరూ హాజరు కావాల్సిందే.

కాగా రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ తో తెరకెక్కించాలి అని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొత్తం జరిగిపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు మహేష్ బాబు. ఇక హీరో మహేష్ తన పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మాములుగా ఏ డైరెక్టర్ అయినా వర్క్ షాప్ వన్ వీక్ లేదా టెన్ డేస్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు.

 

అయితే రాజమౌళి కొన్ని నెలల పాటు వర్క్ షాష్ నిర్వహిస్తాడు. అంతే కాదు ఈ వర్క్ షాప్ కోసం బడ్జెట్ కూడా కేటాయిస్తాడు. ఇక మహేష్ తో తెరకెక్కించబోయే #ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఓ భారీ వర్క్ షాప్ ప్లాన్ చేసాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోయే మహేశ్ బాబు సినిమా కోసం ఆరు నెలల వర్క్ షాప్ ప్లాన్ చేశాడట రాజమౌళి. ఈ మూవీ నెక్ట్స్‌ సమ్మర్‌లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా వర్క్ షాప్ స్టార్ట్ కానుందట. ఈ వర్క్ షాప్‌లో మహేష్ బాబుతో సహా మిగిలిన యాక్టర్స్ అందరికీ ట్రైయినింగ్ ఉంటుందట.

 

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -