Relationship: గర్భవతులతో అలా సె*క్స్ చేయొచ్చా.. డాక్టర్ చెప్పిందిదే!

Relationship: గర్భంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మహిళలకు పుట్టబోయే బిడ్డకు మంచిది. గర్భంతో ఉన్నప్పుడు శృంగారం చేయొచ్చా, చేయకూడదా అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో మంచిది. గర్భధారణ టైంలో స్త్రీ మానసిక స్థితిలో అనూహ్య మార్పు కలుగుతుంది. ఆమె అధిక భావోద్వేగానికి గురవుతుంటుంది. ఆమె మానసిక స్థితి వల్ల పిండంపై ప్రభావం పడుతుంది.

భర్త తనతో మునుపటిలా లేడని, తమ మాటలకు స్పందించడం లేదని భావిస్తే మానసిక స్థితి దెబ్బతింటుంది. గర్భం సమయంలో స్త్రీకి బలమైన లైంగిక కోరికలు లేకపోయినా ఆమెకు సున్నితమైన శారీరక సంబంధం అనే అవసరం ఉంటుంది. ఒక వేళ గర్భస్థ మహిళ లైంగికంగా ఉండాలని అనిపిస్తే వారు ప్రయత్నించవచ్చు. అయితే శృంగారం చేసే సమయంలో స్త్రీ పై స్థానంలో ఉంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

 

గర్భంతో ఉన్న మహిళ శృంగారం చేసే సమయంలో పైస్థానంలో ఉంటే ఆమె పొత్తికడుపుపై ఒత్తిడి పడదు. కదలిక కూడా సున్నితంగా సాగుతుంది. ఒక వేళ పురుషుడు పైస్థానంలో ఉంటే అతని బరువు స్త్రీపై పడుతుంది. కదలికలు కఠినంగా ఉండటం వల్ల పిండానికి భంగం కలిగే అవకాశం ఉంది.

 

అయితే గర్భవతిగా ఉన్న టైంలో 6వ వారం నుంచి 12వ వారం వరకూ కూడా శృంగారంలో పాల్గొనకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే అది గర్భస్రావాన్ని కలిగిస్తుంది. అలాగే గర్భం చివరి రెండు నెలల్లో కూడా సెక్స్ లో పాల్గొనకూడదు. అదేవిధంగా నాలుగవ నెల నుంచి ఏడువ నెలలో సెక్స్ లో పాల్గొనాలంటే వైద్యుల సలహా అనేది కచ్చితంగా తీసుకోవాలి. ఓరల్, ఆనల్ సెక్స్ వంటి లైంగిక చర్యలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -