Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తారక్ కు పోటీనివ్వడం సాధ్యమేనా?

Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు సాధించిన కుటుంబాల్లో నందమూరి కుటుంబం ఒకటి. నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని నందమూరి బాలయ్య, నందమూరి హరికృష్ణలు కొనసాగించగా.. మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు నందమూరి నట వారసత్వాన్ని కొనసాగించడానికి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మాస్ ఫాలోయింగ్ కు కేరాఫ్ గా నిలిచే నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆ మధ్యన లెజెండ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగినా అది కుదరలేదు. లెజెండ్ సినిమా షూటింగ్ లో బాలయ్య వాడిన బైక్ మీద మోక్షజ్ఞ కనిపించడంతో.. అతడు ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఫుల్ లెన్త్ హీరోగానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడనే క్లారిటీ రావడంతో.. నందమూరి అభిమానులు అతడి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

నందమూరి మోక్షజ్ఞ కొతత్త ఏడాదిలో సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి అంతా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈతరుణంలో ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. నందమూరి నట వారసుల మూడో తరంలో ఇప్పటి వరకు ఉన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు నందమూరి మోక్షజ్ఞ కూడా తోడు కానున్నాడు. అయితే ఇప్పటి నందమూరి హీరోల్లోనే కాదు, ఇండస్ట్రీలోనే టాప్ హీరోల జాబితాలో ఉన్న ఎన్టీఆర్ కు మోక్షజ్ఞ పోటీ ఇస్తాడా అనే చర్చ సాగుతోంది.

నందమూరి కుటుంబం నుండే వచ్చిన ప్రారంభంలో ఎన్టీఆర్ కు కుటుంబం అండగా దొరక్కపోయినా స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తెలుగులో టాప్ హీరోల జాబితాలో చేరాడు. మరి నందమూరి కుటుంబం పూర్తి సపోర్ట్ కలిగిన నందమూరి మోక్షజ్ఞ తారక్ స్థాయిని అందుకోగలడా? అతడికి పోటీ ఇవ్వగలడా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ జనాల్లో మొదలైంది. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ తర్వాత ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా.. ఎన్టీఆర్ స్థాయిని అందుకోవడానికి మోక్షజ్ఞ ఎంతో కృషి చేయడంతో పాటు అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -