Samantha: సమంత రెండో పెళ్లి నిజమేనా.. అందుకే తాళ్లి ధరించిందా?

Samantha: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారుతుంది. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ తో పాటు ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా సమంత వ్యాధి బారిన పడడంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన సమంత ప్రస్తుతం ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో సామ్ మెడలో చిన్న నల్లపూసల దండ. దానికి కాస్త దిగువన ఓ పెద్ద పసుపుతాడులో కనిపించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దాంతో సమంత రెండవ పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు దుమారం రేపుతున్నాయి. కొత్తగా పెళ్లయిన మహిళల మెడలోనే పసుపు తాడు ఉంటుంది కాబట్టి, సమంత రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకుంది అంటూ నెట్టింట్లో నానా హంగామా చేస్తున్నారు.

 

అయితే నిజానికి సమంత రెండో పెళ్లి చేసుకోలేదు. ఒక సినిమా షూటింగ్ కోసం ఆమె అలా రెడీ అయ్యింది. రీసెంట్ గా ఖుషి సినిమా సెట్స్ లోకి జాయిన్ అయింది ఈ బ్యూటీ. అందులో ఒక సన్నీ వేషం కోసం ఆమె మెడలో నల్లపూసలు, పసుపుతాడు వేసుకుంది. బహుశా, సినిమాలో అది ఓ పెళ్లి సీన్ కు సంబంధించిన సెటప్ అయి ఉండవచ్చని ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమంత ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -