Rajini Fans: రజనీ ఫ్యాన్స్ తో అవసరమా జగన్.. అనవసరంగా ఇబ్బందులంటూ?

Rajini Fans: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూపర్ స్టార్ రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున రజనీకాంత్ ఫ్యాన్స్ వైసిపి ప్రభుత్వం పై అలాగే సీఎం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అసలు జగన్ రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పడం ఏంటి అనే విషయానికి వస్తే…సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నందమూరి తారక రామారావు పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేశారు.

 


ఇక ఈ కార్యక్రమంలో ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పొగిడారు.ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఏపీ ప్రభుత్వం గురించి జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా రజనీకాంత్ పలకలేదు.అయినప్పటికీ చంద్రబాబు నాయుడుని పొగడటంతో వైసిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు అందరూ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడుని తిట్టడమే కాకుండా రజనీకాంత్ పై కూడా నోరు పారేసుకున్నారు.

 

ఇక కొందరు నేతలైతే చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు కుట్రలో రజనీకి కూడా భాగం ఉందని అలాగే ఎన్టీఆర్ పై చెప్పులు విసరించిన ఘటనలో తనకు కూడా భాగం ఉంది అంటూ పరోక్షంగా రజనీకాంత్ పై దారుణంగా కామెంట్లు చేశారు.ఇలా ఎక్కడా వైసిపి నేతల గురించి మాట్లాడినటువంటి రజనీకాంత్ పై ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా తమిళంలో ఉన్నటువంటి అభిమానులు కూడా మండిపడుతున్నారు.

 

ఈ క్రమంలోనే పదవుల కోసం జగన్ దగ్గర మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మన ముందు ఎవరున్నారు అనే విషయాన్ని మర్చిపోయి వైసిపి నేతలు ప్రవర్తిస్తున్నారని, ఇలా రజనీకాంత్ పై నోరు పారేసుకున్నటువంటి నేతల పట్ల జగన్ స్పందించి రజనీకాంత్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ రజనీకాంత్ అభిమానులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలా ప్రత్యర్థులకు సపోర్ట్ చేసిన వారందరి పట్ల వైసిపి నేతలు నోరు పారేసుకుంటూ ఉండటం వల్ల వచ్చే లాభమేం లేదని కేవలం శత్రువులు మాత్రమే పెరుగుతారు అంటూ మరికొందరు వైసిపి నాయకుల పై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Minister Roja: నాడు అప్పులు నేడు కోట్ల రూపాయల ఆస్తులు.. ఆ పనులు చేసి రోజా కోట్లు సంపాదించారా?

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈసారి కూడా తనను గెలిపించే...
- Advertisement -
- Advertisement -