Jagan: వైసీపీ ఉద్యోగులకు జగన్ అంటే ఇంత అభిమానమా?

Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయన జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగులు వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐఆర్‌సీఎస్ సహకారంతో, వైసీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు ఆన్‌లైన్‌లో రక్తదానం కోసం ప్రతిజ్ఞ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం విశేషంగా చెప్పొచ్చు.

 

సీఎం జగన్ జన్మదినం సందర్భంగా 72 గంటల ముందు నుంచి లక్ష మందికి పైగా రక్తదానం చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. రక్త దానానికి సంబంధించి IRCS నుంచి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా వారు అందుకున్నారు. అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు క్రీడలు, సాహిత్య కార్యక్రమాలు, ప్లాంటేషన్‌ డ్రైవ్‌లు, పేదలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాల్లో నిర్వహిస్తూ సీఎం జగన్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ మద్దతుదారులు, లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సీఎం జగన్ ఫోటోలు, ప్రత్యేక వీడియోలను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో #HBDYSJAGAN అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఆ హ్యాష్ ట్యాగ్ దేశంలోనే 3వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.

 

ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు సీఎం జగన్ పుట్టినరోజును పురష్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. అలాగే అనాథశరణాలయంలోను, పేదలకు అన్నదానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ అభిమాన, ప్రియతమ నాయకుడు జగన్ నిండు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని అందరూ దీవిస్తున్నారు. ఒక్క ఏపీలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో జగన్ పుట్టినరోజు వేడుకలు జరుగుతుండటం విశేషం.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -