Komati : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తక్షణ కర్తవ్యం రాజకీయ సన్యాసమేనా?

Komati : మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలనే డిమాండ్లు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోన్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయమే ప్రస్తుతం వైరల్ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని, వెంటనే రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని, తాను గెలుస్తానంటూ గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

 

ఆదివారం వచ్చిన మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల్లో రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు. దీంతో గతంలో రాజగోపాల్ రెడ్డి చేసిన సవాల్ ను ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ గెలవడంతో రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తోన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తోన్నారు. దీనిపై నెటిజన్లు రాజగోపాల్ రెడ్డిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ప్రశ్న అడిగేటప్పుడు యాంకర్ అప్పటికే చెప్పింది. ఆలోచించి మాట్లాడండి.. లేకపోతే ఎన్నికల్లో ఓడిపోతే దీన్ని వైరల్ చేస్తామంటూ యాంకర్ సూచించింది. కానీ రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గకుండా అదే రిపీట్ చేశారు.

 

ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోవడంతో రాజగోపాల్ రెడ్డి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ ట్రోల్స్ చేస్తోన్నారు. అందుకే మట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, లేకపోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయంటూ చెబుతున్నారు. కాగా మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా మెజార్టీతో గెలిచారు.ఇక రెండో స్థానంలో రాజగోపాల్ రెడ్డి నిలవగా.. మూడో స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -