KVP Ramachandrarao: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ సుపరిచితమైన పేరు కేవీపీ రామచంద్రరావు.. ఆయన పేరు వినగానే అందరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తుంటారు. ఎందుకే కేవీపీని వైఎస్ ఆత్మగా అందరూ పిలుస్తూ ఉంటారు. వైఎస్ కు రైట్ హ్యాండ్ గా, అత్యంత నమ్మినబంటుగా కేవీపీకి పేరు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షాడో సీఎంగా కేవీవీ రామచంద్రరావు గుర్తింపు పొందారు. కేవీపీకి చెప్పుకుంటే వైఎస్ కు చెప్పినట్లేనని అందరూ భావిస్తారు. పదవులు, నియామకాలు.. ఇలా ఏ విషయంలో అయినా సరే ప్రభుత్వంలో కేవీపీ కీలక పాత్ర పోషించేవారు.
అలాగే వైఎస్ కుటుంబంలో ఒక కుటుంబసభ్యుడిగా కేవీపీని పరగణిస్తారు. సీఎం జగన్ ప్రమాణస్వీకారం సమయంలోనూ కేవీపీ దగ్గర ఉండారు. అంతగా వైఎస్ ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా కేవీపీని అందరూ భావిస్తున్నారు. వైఎస్ మరణం దర్వాత సీఎం వైఎస్ జగన్ వైసీపీ పార్టీని నెలకోల్పగా.. కేవీపీ రామచంద్రరావు మాత్రం కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఇటీవల వైఎస్, పోలవరం గురించి ఒక పుస్తాకాన్ని ఆయన కూడా ఆయన విడుదల చేవారు. వైఎస్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని ఓ హోటల్ లో పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ సమాధి అయిపోవడంలో రాష్ట్ర రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానంతో మాత్రం టచ్ లో ఉంటున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కేవీపీ రామచంద్రరావుకు మంచి సాన్నిహిత్యం ఉంది. జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ లో ఆయన కీలక నేతగా కొనసాగుతున్నాయి. అయితే ఏపీలో కాంగ్రెస్ ఉన్నా.. లేనట్లుగానే ప్రజల్లో భావన ఉంది. దీంతో ఏపీ రాజకీయాలను వదిలేసి ఆయన తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ లో కేవీపీ చక్రం తిప్పుతున్నారు.
అయితే కేసీఆర్ కు అనుకూలంగా కాంగ్రెస్ ను మల్చేందుకే కేవీపీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్లందరూ సీఎం కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ఉంది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి సీనియర్ నేతలందరూ కేసీఆర్ మనుషులనే టాక్ తెలంగాణ రాజకీయాల్లో బలంగా ఉంది. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ ను బలహీనపర్చే విధంగా సీనియర్లు ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయనకు అసలు సీనియర్లు ఎవరూ సహకరించడం లేదు. రేవంత్ పై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రేవంత్ తీరు సరిగ్గా లేదని అధిష్టానానినికి ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీలోని రేవంత్ తీసుకున్న నిర్ణయాలను, ఆయన చేసే పనులను పూర్తిగా అడ్డకుంటున్నారు. రేవంత్ ను ఒక్క పనికూడా చేయనీయకుండా సీనియర్లు అడ్డుపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి పోరు వల్ల పార్టీ మరింత బలహీనపడిపోతుంది.
పార్టీని బలహీనం చేస్తే రేవంత్ రెడ్డిని బలహీనం చేసినట్లేనని సీనియర్లు భావిస్తున్నారు. అందుకే పార్టీని మైలేజ్ రానివ్వకుండా వెనుక నుండి చక్రం తిప్పుతున్నారు. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు తెలంగాణకు ప్రత్యేక గీతం రూపొందించారని రేవంత్ భావించారు. కానీ దానిని కూడా సీనియర్లు వ్యతిరేకిస్తు్నారు. తమకు చెప్పకుండా రేవంత్ ఎలా ప్రకటన చేస్తారని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కేవీపీ రామచంద్రరావు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఏఐసీసీ కార్యక్రమాల వ్యవహారాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ మీటింగ్ లో మునుగోడు ఉపఎన్నికతో పాటు పార్టీతోనఅ ంతర్గత విబేధాలపై చర్చ జరిగింది. ఈ డిన్నర్ మీట్ కు జానారెడ్డి, భట్టి, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, వి,హనుమంతరావు, శ్రీధర్ బాబు లాంటి నేతలు వచ్చారు. ఇక ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి కాస్త ఆలస్యంగా వెళ్లారు. కానీ తెలంగాణ నేతలు హాజరైన ఈ డిన్నర్ మీట్ కు ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియ్ నేత కేవీవీ హాజరుకావడం కలకలం రేపుతోంది. రేవంత్ రాకముందు సీనియర్ నేతలతో ఆయన రహస్య సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస నేతలను కేసీఆర్ అనుకూలంగా చేయడంలో కేవీపీ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.