Priya Chowdary: అమ్మాయిలు ఈ తప్పులు చేస్తే మాత్రమే జీవితం నాశనమవుతుందా?

Priya Chowdary: ఈ మధ్యకాలంలో చూస్తే పెళ్లయిన అమ్మాయిలు తమ అత్తవారింటి వైపు నుండి చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే చాలామంది అమ్మాయిలు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి బయటికి చెప్పుకోకుండా లోలోపల అత్తింటి వేదనలతో కుమిలిపోతున్నారు. మరి కొంతమంది ధైర్యంతో ముందుకు వచ్చి తమ సమస్యలను దూరం చేసుకుంటున్నారు.

అయితే పెళ్లయిన తర్వాత ఇటువంటి సమస్యలు వస్తే మాత్రం మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే చాలా కష్టమైనది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి గా ఉంటుంది. అందుకే పెళ్లికి ముందు అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

అయితే తాజాగా లాయర్ ప్రియ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది. అంతేకాకుండా తన తన దగ్గరికి వచ్చిన ఒక క్లైంట్ గురించి కూడా ఒక విషయాన్ని చక్కగా వివరించింది. అందులో ఒక తల్లి ఎంతో కష్టపడి తన బిడ్డకు పెళ్లి చేయగా.. చివరికి ఆ వ్యక్తికి అదివరకే పెళ్లయిందని.. అంతేకాకుండా ఆ వ్యక్తి సంసారానికి పనికిరాడు అని తెలియడంతో ఆ కూతురు తో పాటు తల్లి చాలా ఆవేదన చెందిందని తెలిపింది.

 

అయితే ఆ కూతురు కూడా అప్పటికే అత్తవారు తనను వేధిస్తున్న విషయాన్ని తన తల్లికి చెబితే తను ఎంత బాధ పడుతుందో అని చెప్పకుండా లోలోపల కుమిపోయింది అని తెలిపింది ప్రియ చౌదరి. అయితే అమ్మాయిలు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే చాలు మంచి లాయర్ ను ఎంచుకొని సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి అని తెలిపింది.

 

అందరూ బాధపడతారని అలా ఉంటే మాత్రం.. భవిష్యత్తు మరింత బాధాకరంగా ఉంటుందని తెలిపింది. కాబట్టి పెళ్లయిన తర్వాత మీ అత్తవారింటి తరఫున ఏవైనా ఇబ్బందులు ఎదురవుతే వెంటనే కొందరు సహాయంతో సపోర్ట్ తీసుకోవాలి అని తెలిపింది. ఇక పెళ్లికి ముందు కూడా ఎవరిని చేసుకుంటున్నాము.. ఎలాంటి వ్యక్తిని చేసుకుంటున్నాము.. అనేది ఇతరుల ద్వారా తెలుసుకోవాలి అని తెలిపింది. ముఖ్యంగా అమ్మాయి పెళ్లి చేసే తల్లిదండ్రులు అబ్బాయి బంధుత్వం గురించి, అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత అమ్మాయిని ఇవ్వాలి అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -