Lokesh: లోకేశ్ వల్ల పార్టీకి నష్టమేనా.. పార్టీ పరిస్థితి దారుణం కానుందా?

Lokesh: లోకేష్ తన పాదయాత్రని ప్రారంభించి వంద రోజులు దాటింది అయినా ఆయన యాత్రలో గాని కార్యకర్తలలో గాని ఎక్కడ పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. లోకేష్ ప్రసంగాలు కూడా చాలా పేలవంగా సాగుతున్నాయి. వంద రోజుల సందర్భంగా లోకేష్ కి సోషల్ మీడియా పరంగా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు ఎందుకో బయటకు మాత్రం కొడుకు మీద చూపించవలసినంత ఉత్సాహం చూపించడం లేదు అంటున్నారు రాజకీయ వర్గాల వారు.

అందుకు కారణం ఏమిటి అనేది స్పష్టంగా తెలియకపోయినా ఇవ్వవలసిన ప్రసంగాలలో స్పష్టత లేకపోవడం.. చంద్రన్న పథకం అనటానికి బదులు జగనన్న పథకం అని చెప్పటం త్రివేణి సంగమం అని కూడా పలకలేక పోవడం లోకేష్ లోని అసమర్ధతని మనం గుర్తించవచ్చు. అలాంటి అసమర్థుడిని తను మెచ్చుకోవటం అనవసరం అనుకున్నట్లుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు.

 

లోకేష్ పాదయాత్ర కోసమే పవన్ కళ్యాణ్ ని ఇన్నాళ్లు ఆపడంట చంద్రబాబు నాయుడు ఒకేసారి సొంత పుత్రుడు దత్తపుత్రుడు యాత్రలకు వెళ్తే ప్రచారం తగ్గిపోతుందని లెక్కలు కట్టుకున్నాడు ఏమో.. మన మాజీ సీఎం. అయితే చంద్రబాబు నాయుడు లోకేష్ పాదయాత్రకి ముందుగా అంగీకరించలేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే కొడుకు అసమర్ధత తండ్రిగా అతనికి తెలుసు.

 

జనం మధ్యకి వెళితే మరింత అభాసు పాలవుతాడు అని ముందే గ్రహించి ఉంటాడు. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు కార్యకర్తల మధ్యకి వెళ్తున్నప్పటికీ లోకేషన్ గురించిన ప్రస్తావన తీసుకురావడం లేదు. ఇవేమీ పట్టించుకోని లోకేష్ తన పాదయాత్రతో రాయలసీమ ను దాటేసాడు. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే పార్టీ శ్రేణులు కూడా పెద్దగా లోకేష్ కి మద్దతు ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు.

 

అందుకు ఉదాహరణ అనంతపురం వంటి చోట్ల వచ్చిన స్పందన అక్కడ లోకేష్ తో పాటు పాల్గొన్న టిడిపి నాయకులని చూస్తే మనకి అర్థమవుతుంది. వీటన్నిటిని చూస్తుంటే లోకేష్ పాదయాత్ర వల్ల పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. పైగా పార్టీ పరిస్థితి మరింత దారుణం కానుందా అనేట్లు గా తయారయింది పరిస్థితి.

 

Related Articles

ట్రేండింగ్

BJP: బీజేపీ కూటమికి బలం అవుతుందా.. బలహీనత అవుతుందా.. ఇంత దారుణమైన పరిస్థితులా?

BJP:  భారతదేశంలో బీజేపీ కి ఎంత బలం ఉన్నా తెలుగు రాష్ట్రాల వద్దకు వచ్చేసరికి బీజేపీ బలం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎక్కువ మద్దతు లేకపోవడంతో బీజేపీ తెలివిగా...
- Advertisement -
- Advertisement -