Manoj: ఆరోజే మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో వీరి పాత్ర ప్రత్యేకం. సీనియర్ నటుడు మోహన్ బాబు ఇండస్ట్రీలో అందరితో కలవిడిగా ఉంటారు. ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు కూడా కుర్ర హీరోలతో స్నేహంగా మెలుగుతారు. తాజాగా మంచు మనోజ్ తన రెండో పెళ్లికి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. త్వరలోనే మంచు మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఖరారైంది.

 

రాయ‌ల‌సీమ‌ ప్రాంతానికి చెందినటువంటి ప్ర‌ముఖ రాజ‌కీయ నేత దివంగ‌త‌ భూమా నాగిరెడ్డి, శోభా దంప‌తుల రెండో కుమార్తె అయిన మౌనిక‌ను మంచు మనోజ్ పెళ్లి చేసుకోనున్నాడు. 2023, ఫిబ్ర‌వ‌రి 2వ తేదిన వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. మంచు మ‌నోజ్‌, మౌనికలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. మౌనిక‌కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. కొన్ని మన‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా మొద‌టి వివాహాలు వీరికి కలిసి రాక చాలా ఇబ్బందులు పడ్డారు.

 

ఇద్దరూ మొదటి వారితో విడాకులు కూడా తీసేసుకున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్, భూమా మౌనికలు కొంతకాలం ట్రావెల్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు వీరు హైదరాబాద్ లో కలిసి ఉండబోతున్నారని సమాచారం. సెప్టెంబర్ లో వినాయక మండపానికి మౌనికతో కలిసి మనోజ్ వచ్చారు. అప్పుడే వారిద్దరికీ పెళ్లి జరుగుతుందని వార్తలు కోడై కూశాయి.

 

ఆ సమయంలో మనోజ్ ను పలువురు ప్రశ్నించారు కూడా. అయితే మౌనికతో పెళ్లి గురించి, తాను రాజకీయాల్లోకి వచ్చే విషయం గురించి త్వరలోనే చెబుతానని మనోజ్ మీడియా ముఖంగా తెలిపాడు. తాజాగా వారి పెళ్లి గురించి వార్తలు మరోసారి బయటికొచ్చాయి. తమ పెళ్లికి రావాలని బంధువుల్ని వీరు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే పెళ్లి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే పూర్తిగా తెలుస్తాయిలే అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -