Megastar: ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నిజంగా దేవుడేనా?

Megastar: మెగా ఫ్యామిలీ నుంచి గుడ్‌న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పదేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యామిలీ పట్టరాని సంతోషంలో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ ఇళ్లల్లో ఎక్కడ విన్నా.. ప్రస్తుతం ఉపాసన పేరు మాత్రమే వినిపిస్తోంది. సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులు తమ హీరోను ఏ విధంగా అభిమానిస్తారో తెలిసిన విషయమే. తమ హీరో మంచితనం, సేవా కార్యక్రమాలు, అభిమానులతో పలకరింపు విధానాన్ని బట్టి దేవుడిగా కొలుస్తుంటారు. అలాంటి మెగా ఫ్యామిలీ కోడలు గర్భవతి అని తెలిసినప్పుడు.. ఇంటి మనిషే ప్రెగ్నెంట్ అయినట్లు భావిస్తారు. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఉపాసనను ఆశీర్వదిస్తున్నారు. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకుంది మెగా కోడలు.

 

అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి చేసిన పని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అదే హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ ఈ గుడ్‌న్యూస్ వినడానికి ఎంతగా వెయిట్ చేశారో.. అంతకంటే ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి తన మనవడి కోసం ఎదురు చూశారు. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణం.. చిరంజీవి పరుగు పరుగునా.. పూజ గదిలోకి వెళ్లాడట. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి.. సింధూరం తీసుకొచ్చి ఉపాసనను ఆశీర్వదించారట. ఆ సమయంలో చిరంజీవి చాలా ఎమోషనల్ అయినట్లు ఉపాసన తన ఫ్రెండ్స్ కు కూడా చెప్పినట్లు సమాచారం. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో మెగా కోడలిపై దారుణమైన ట్రోల్ జరిగింది. పదేళ్లు అయినా.. పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొంత మంది అయితే బూతులు కూడా తిట్టారు. కానీ చిరంజీవి మాత్రం ఏనాడు ఉపాసనపై కోపగించుకోలేదు. వాళ్ల జీవితం.. వాళ్ల ఇష్టం.. వాళ్లకు ఎప్పుడు తల్లిదండ్రులు అవ్వాలని ఉంటే అప్పుడే అవ్వని అని.. వాళ్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతే కానీ తన ఆశలను ఏ రోజూ బయటపెట్టలేదు. ఈ విషయం తెలిసిన మెగాఫ్యాన్స్ మెగాస్టార్ ఆలోచనకు హ్యాండ్సాఫ్ చేస్తున్నారు. ఇంత మంచి మనసు ఉన్న చిరంజీవికి చేతులెత్తి దండం పెట్టాలని ఫ్యాన్స్ అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -