Pooja Hegde: పూజా హెగ్డే అంటే ఆ డైరెక్టర్లకు ఇంత అభిమానమా?

Pooja Hegde: ఫిలిం ఇండస్ట్రీలో అనాదిగా సెంటిమెంట్లు అనేది కామన్ గా వస్తున్న కాన్సెప్ట్. ఒకప్పుడు కొందరు హీరోలు వరుసగా ఒకే హీరోయిన్ ని తమ సినిమాలో రిపీట్ చేసేవారు. వాళ్ళిద్దరూ జంటగా నటించడం వల్లే తమ సినిమా సక్సెస్ అయ్యింది అని ఓ సెంటిమెంట్ ఎందుకు ప్రధాన కారణం. అలాగే కొందరు నిర్మాతలు కూడా ఒకే హీరోయిన్ తమ సినిమాలో రిపీట్ చేయడం, దర్శకులు హీరోల కాంబినేషన్లు రిపీటెడ్ గా రావడం అప్పట్లో క్రేజ్ లో ఉండేది. అయితే చాలా రోజుల తర్వాత తిరిగి ఆ సెంటిమెంట్లను ఇప్పుడు కొందరు ఫిలిం ఇండస్ట్రీలో కంటిన్యూ చేయడానికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు.

 

ఒక హీరో, హీరోయిన్ తో వచ్చిన మూవీ హిట్ అయినట్లయితే ప్రేక్షకులు వాళ్ళిద్దరినీ మళ్ళీ తిరిగి చూడాలి అన్న ఆత్రుత ప్రదర్శిస్తున్నారు. అలాగే ఓ హీరో దర్శకుడు కాంబినేషన్ సక్సెస్ అయితే తిరిగి వాళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి మూవీ రావాలి అని అంచనాలు పెరుగుతున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే మూడేళ్లుగా పట్టిందల్లా బంగారంగా ఉంది. అప్పటివరకు వరుస ప్లాపులతో బాధపడుతున్న ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస చాన్సులతో బిజీగా ఉంది.

 

కానీ రీసెంట్ గా ఆమె నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయని చెప్పుకోవచ్చు. పైగా రష్మిక ,శ్రీ లీల లాంటి కొత్త హీరోయిన్ల దాటి కి పూజా కొంచెం తరబతోందని చెప్పొచ్చు. అయినా సరే పూజను ఇద్దరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అన్నట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు పూజా పై అంత ప్రేమ ఏంటో? అన్న రూమర్స్ క్రమంగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పూజకు తన మూవీస్ లో వరుసగా ఛాన్స్ ఇస్తున్నాడు. అల వైకుంఠపురం , అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా పూజ అనేది తీసుకుంటున్నాడు. ఇంతకుముందు మహర్షి సినిమాలో మహేష్ తో పూజా జతకట్టిన విషయం అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ ఎప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నాడు. మరోపక్క హరీష్ శంకర్ కూడా పూజా పిచ్చి లో ఉన్నాడు.

 

దువ్వాడ జగన్నాథం ,గద్దలకొండ గణేశ్ సినిమాలలో పూజకు ఆఫర్స్ ఇచ్చిన హరీష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ముస్తాబాద్ సింగ్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఈ ఇద్దరు డైరెక్టర్లకు హీరోయిన్గా పూజా తప్ప ఇంకెవరు కనిపించే స్థితిలో లేరు అని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఆమె మాయలో పడడానికి వెనుక కథేమిటో తెలియక ఇండస్ట్రీ వర్గాలు తికమక పడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -