Puri Jagannadh: పూరీ జగన్నాథ్ సినిమాలు డిజాస్టర్లు కావడం వెనుక అసలు రీజన్ ఇదేనా?

Puri Jagannadh: టాలీవుడ్ ప్రేక్షకులకు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బద్రి సినిమాలో దర్శకుడుగా ప్రేక్షకులకు పరిచయమైన పూరి ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పోకిరి సినిమాతో పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం నేనింతే వంటి పలు మాస్ స్టోరీలతో స్టార్ హీరోల జత కట్టి పూరి డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు.

కానీ గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ సినిమాలు పూర్తిగా పరాజయం అవుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ అందించింది.. ఇక నిన్నటికి నిన్న విడుదలైన లైగర్ సినిమా విషయం లో కూడా పూరి నిరాశ పడక తప్పలేదు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

మరి అంత భిన్నంగా సినిమా స్టోరీలు ఎంచుకొని స్టోరీ రూపంలో మరో స్థాయిలో మెప్పించే పూరి.. ఇలా డీలా పడిపోవడం వెనక కారణాలు తెలియడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రైటర్ కోన వెంకట్ పూరీ జగన్నాథ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు బయటపెట్టాడు. పూరి జగన్నాథ్ ఒక మంచి డైరెక్టర్.. తనే కథ రాసుకోగలడు.. తానే దర్శకత్వం వహిస్తాడు అని కోన వెంకట్ తెలిపారు.

కానీ పూరికి చాలా స్పీడ్ ఎక్కువ.. ఏ సినిమా అయినా అతి తక్కువ రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇలా స్పీడ్ గా సినిమా కథల రూపంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా స్పీడ్ గా వెళ్లడం ద్వారా ప్రమాదాలు దొరుకుతాయి. కాగా పూరి జగన్నాథ్ విషయంలో కూడా అలానే జరుగుతుంది. అతని స్పీడ్ వలన కొన్ని సినిమాలు పూర్తిగా పరాజయ పాలవుతున్నాయి అన్నట్లు రైటర్ కోన వెంకట్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -