Rishabh Pant: రిషబ్ పంత్ ను ఢిల్లీ తరలించి సర్జరీ చేస్తున్నారా? పంత్ విషయంలో బ్యాడ్ న్యూస్?

Rishabh Pant: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కి గురికావడం తెలిసిందే. తన కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచాలని దుబాయ్ నుండి ఎవరికీ తెలియకుండా రిషబ్ పంత్ ఢిల్లీకి రాగా.. తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళుతుండగా.. రూర్కీ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతడు ప్రయాణిస్తున్న బీఎండబ్లూ కారు వేగంగా డివైడర్ ని ఢీకొట్టగా.. అది పల్టీలు కొట్టింది. దీంతో మంటలు చెలరేగగా.. స్థానికులు అతడిని కాపాడి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

శుక్రవారం ఉదయం పూట ఈ వార్త బయటకు రాగా.. రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. అతడికి గాయాలు ఎక్కువ అయ్యాయని, వాటికి చికిత్స జరుగుతోందని, అయితే అతడి ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని వైద్య బృందం చెప్పినట్లు పలు మీడియా ఛానల్స్ లో వార్తలు కూడా వచ్చాయి.

 

అయితే తాజాగా వస్తున్న వార్తలు మాత్రం రిషబ్ పంత్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రిషబ్ పంత్ ఆరోగ్యంపై ఇప్పుడు చెప్పడం కష్టం అని వ్యాఖ్యానించడం అందరికీ బాధ కలిగిస్తోంది. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఒక బృందం రిషబ్ పంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి మ్యాక్స్ ఆస్పత్రికి వెళుతోంది. అవసరమైతే మేము అతనిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తాం. కాలికి అయిన ఫ్రాక్చర్ పెద్దదిగానే ఉందని తెలిసింది. ప్లాస్టిక్ సర్జరీ కోసం పంత్ ను విమానంలో ఢిల్లీకి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పంత్ ఆరోగ్యంపై ఇప్పుడు చెప్పడం కష్టం. ఈరోజు అతడికి అనేక పరీక్షలు జరగనున్నాయి. రిషబ్ తల్లి మరియు అతని స్నేహితులు కొందరు ఆస్పత్రిలో ఉన్నారు’ అని అన్నారు.

 

అదే సమయంలో బీసీసీఐ ప్రకటన ప్రకారం రిషబ్ పంత్ చాలాకాలం పాటు క్రికెట్ కి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలా రెండు వేర్వేరు ప్రకటనలు రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి కాస్త ఆందోళనకరమైన విషయాలనే వెల్లడిస్తుండటం క్రికెట్ అభిమానుల్లో కలకలం రేపుతోంది. టీమిండియా తరఫున ప్రత్యర్థి జట్టుకు చమటలు పట్టిస్తాడని అనుకున్న రిషబ్ పంత్ ను.. ఆస్పత్రిలో, తీవ్ర గాయాలతో చూడాల్సి రావడం ఎంతోమంది అభిమానుల్లో కన్నీరు తెప్పిస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -