Salman-Pooja Hegde: పూజా హెగ్డేతో సల్మాన్ ఖాన్ డేటింగ్.. ఏకంగా ఇంతకు తెగించారా?

Salman-Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే,బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కిసీకా భాయ్ కిసీకి జాన్ సినిమాలో పూజా సల్మాన్ ఖాన్ ఇద్దరు మొదటిసారి కలిసిన నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తూనే ఉన్నాయి.

అంతేకాకుండా సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా రిఫర్ చేస్తున్నాడు అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో వారిద్దరి మధ్య ఖచ్చితంగా ప్రేమ నడుస్తోంది అందుకే పూజ హెగ్డే ని సల్మాన్ ఖాన్ రిఫర్ చేస్తున్నాడు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆ వార్తలను నిజం చేశాడు సల్మాన్ ఖాన్. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటైన భజరంగీ భాయ్ జాన్ సినిమా సీక్వెల్‌ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 

అయితే గతంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కరీనా కపూర్‌ ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపించగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ కరీనాకపూర్ కి బదులుగా పూజ హెగ్డే తీసుకోమని రెఫర్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే పూజా హెగ్డేను తీసుకోవడానికి సల్మాన్‌ డెసిషన్‌ తీసుకున్నాడు అంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి..

 

పూజ హెగ్డే విషయానికి వస్తే.. పూజా చివరగా బీస్ట్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచాయి. ఇంతకుముందు ప్రభాస్ తో కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం పూజ హెగ్డే పరిస్థితి అయోమయంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -