Bigg Boss: బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆమేనా?

Bigg Boss: స్టార్ మా అందిస్తున్న బిగ్ బాస్6 షో చివరి అంకానికి చేరుకుంది. ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని అందరూ సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే హౌస్ లోని ఏడుగురు సభ్యుల్లో ఒకరైన శ్రీహాన్ కి టికెటు ఫినాలే పాస్ రావడంతో ఆయన ఎలిమినేషన్ లో ఉండడు. మిగిలిని ఆరుగురిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ కావడం పక్కాగా తెలుస్తోంది.

 

ఇక ఈ సీజన్ లో టాప్ 5లో ఎవరుంటారోనని, విన్నర్ ఎవరు అవుతారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్6 షోలో ఇప్పుడు మిగిలిన ఆరుగురులో రేవంత్, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ వంటివారు ఉన్నారు. ఓటింగ్‌లో ఈ ఆరుగురి మధ్య గట్టి పోటీ నెలకొంది. మరో విషయం ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉంది.

 

బిగ్ బాస్6లో ఈ వారం ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తే ఆ తర్వాత టాప్5 మాత్రమే మిగిలి ఉంటారు. కాబట్టి ఎవరు ఓటింగ్ లో ఫస్ట్ ఉంటారో, ఎవరు లాస్ట్ ఉంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటింగ్ విషయానికి వస్తే టాప్ లో రేవంత్ ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్, ఇనయా, ఆదిరెడ్డి, శ్రీసత్య ఉన్నట్లు తెలుస్తోంది. చివరగా కీర్తి ఉందని అర్థమవుతోంది.

 

కంటెస్టెంట్లలో కీర్తి, శ్రీసత్యకు ఓట్ల శాతంలో ఎక్కువ తేడా అనేది లేదు. కొన్ని ఎపిసోడ్ల నుంచి శ్రీసత్య తన గేమ్ ను మెరుగ్గా ఆడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీసత్య, కీర్తిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరూ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఈ వారం బిగ్ బాస్6 షో కాస్త ఆసక్తికరంగా సాగనుంది. ఎలిమినేట్ అయ్యేది ఎవనేది తేలనుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -