Shah Rukh Khan: షారుఖ్ ఇంటి కోడలు కాబోయే లక్కీ గర్ల్ ఆమేనా?

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతాయి. ప్రతి సినిమా కూడా ఓ సంచలనం కలిగిస్తుంది. తాజాగా ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్యన్ ఖాన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని పలు వార్తలు వస్తుంటే ఇంకొన్ని మాత్రం ఆయన పెళ్లి చేసుకోవడం లేదని, కానీ డేటింగ్ మాత్రం చేస్తున్నాడని వైరల్ అవుతున్నాయి.

 

ప్రస్తుతం ఈ వార్తలే బాలీవుడ్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ పేరు మీడియాలో వినిపిస్తూనే ఉంది. స్టార్ సన్ గా పుట్టిన ఆర్యన్ ఖాన్ లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారు. మితిమీరిన స్వేచ్ఛ వల్ల కొన్ని తప్పుడు పనులు కూడా చేశాడంటూ అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు.

 

తాజాగా డ్రగ్స్ విషయంలో ఆర్యన్ జైలు జీవితాన్ని అనుభవించాడు. అయితే ఇండస్ట్రీలోకి హీరోగా రాకుండానే షారుఖ్ ఖాన్ కొడుకు ఓ రేంజ్ లో మీడియాకు హాట్ టాపిక్ గా మారిపోయాడు. తాజాగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సెక్సీ ఫిగర్ గా పేరు సంపాదించుకున్న నూరా ఫతేహీతో అతడు డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. అంతేకాకుండా నోరా ఫతేహి, ఆర్యన్ ఇద్దరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లారని, అక్కడే విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. ఆమెను కోడలుగా చేసుకోవడానికి షారుక్ ఖాన్ కూడా సిద్ధంగా ఉన్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నూరా ఫతేహి వయసు 30 ఏళ్లు కాగా ఆర్యన్ వయసు కేవలం 25 ఏళ్లు కావడం విశేషం. వీళ్ల మధ్య ఐదేళ్ల తేడా ఉన్నా బాలీవుడ్ లో అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఒకవేళ ఇదే నిజమైతే షారుక్ ఖాన్ ఇంటికి స్టార్ హీరోయిన్ కోడలుగా వెళ్లబోతుందన్నమాట.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -