Sunitha: కన్న కొడుకు కోసం సునీత అలాంటి రిస్క్ చేస్తున్నారా?

Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మొదటగా టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యతగా ఎంట్రీ ఇచ్చిన సునీత.. సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు చేపట్టింది. 15 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. ‘గులాబీ, ఎగిరే పావురమా’ సినిమాల ద్వారా సునీతకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. 8ఏళ్ల సినీ ప్రయాణంలో 500కు పైగా సినిమాల హీరోయిన్లకు వాయిస్ అందించింది. సునీతకు 19 ఏళ్ల వయసులో కిరణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఆకాష్, శ్రేయ అనే కొడుకు కూతురు ఉన్నారు. వీరిద్దరూ కూడా సింగర్స్. అయితే భర్త కిరణ్ చేష్టలు నచ్చకపోవడంతో.. 2011లో విడాకులిచ్చింది. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మీడియా గ్రూపు అధినేత రామ్ వీరపనేనినితో పెళ్లి చేసుకుంది.

 

వేరే వివాహం చేసుకున్న తర్వాత సింగర్ సునీత కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నారు. తమతోపాటు తమ పిల్లల భవిష్యత్‌పై కూడా అడుగులు వేస్తున్నారు. తాజాగా సునీత తన కొడుకును వెండి తెరకు పరిచయం చేసుకుందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా సింగర్ సునీత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టుకి ఆకాష్ లేటెస్ట్ ఫోటోలు యాడ్ చేసింది. తన వారసుడిని హీరోగా పరిచయం చేయబోతున్నానని పేర్కొంది. కష్టసమయంలో తనకు అండగా నిలబడిన తన కొడుకు, కుమార్తెల భవిష్యత్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు తల్లీకొడుకుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పిల్లల భవిష్యత్‌ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. కాగా, సునీత రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి వాయిస్ ఇచ్చారు. సోషల్ మీడియాలోన యాక్టివ్‌గా ఉంటూ.. స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెడుతుంటారు. తన పోస్టులతో ఎందరికో ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -