Tamanna: ఆ వ్యక్తిని తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారా?

Tamanna: మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. తమన్నా సినిమాలతో పాటు, తమన్నాకి సంబంధించిన పర్సనల్ విషయాలు అభిమానులకు చాలా ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇక అలంటి ఆసక్తి కలిగించే విషయమొకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. తమన్నా పెళ్ళికి సంబంధించిన విషయం అవ్వడంతో ఫాన్స్ తో పాటు, తెలుగు సినీ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది ఈ టాపిక్.

 

 

పెళ్ళికి ఓకే చెప్పిన తమన్నా?
తాజాగా బయటికి వచ్చిన న్యూస్ ప్రకారం.. ముంబైకి చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్త తో టామ్ పెళ్ళికి ఓకే చెప్పిందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న అతన్ని.. జీవితంలోకి ఆహ్వానించడానికి రెడీ అయిపోయిందట. త్వరలోనే ఏ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో.. ఈ విషయానికి బలం చేకూరుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే టామ్ బేబీ పెళ్లి పీటలు ఎక్కుతుంది.

 

అయితే ఇలా తమన్నా పెళ్లి విషయం చర్చకు రావడం కొత్తేమి కాదు. గతంలోనూ క్రికెటర్ తో ప్రేమాయణం అని, ఒక ప్రముఖ వ్యక్తితో ప్రేమలో ఉందని చాలానే పుకార్లు వచ్చినా.. అవి నిజం కాదని తమన్నా కొట్టిపడేసింది. ఇక ప్రస్తుతం మళ్ళీ అలాంటి విషయమే చర్చకు రావడంతో అది నిజామా? కాదా? అనే డైలమా లో ఉన్నారు తమన్నా అభిమానులు.

 

ఇక ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయిన తమన్నా.. బాలీవుడ్ లో మోస్తరు సినిమాలతో అలరిస్తుంది. ఇటీవల ప్లాన్ బి మూవీతో OTT ద్వారా అభిమానులను అలరించింది. టాలీవుడ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటించనుంది. సరికొత్త నిర్ణయాలతో అద్భుతమైన పాత్రలు చేస్తూ అలరించే తమన్నా.. పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: మేకబోతు గాంభీర్యంతో జగన్ ఎన్నికల పోరు.. సర్వేలను కొంటే సరిపోతుందా?

CM Jagan: త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కావడంతో ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్ కూడా దాఖలు చేశారు....
- Advertisement -
- Advertisement -