NTR: పిల్లల విషయంలో తారక్ దంపతుల బాధకు కారణమిదేనా?

NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. కాగా గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం రూపొందుతున్న సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ వ్యక్తిగత జీవిత విషయాల గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా వీరికి అభయ్ రామ్, భార్గవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే సమయం దొరికినప్పుడల్లా భార్య పిల్లలతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కు ఎంత గుర్తింపు దక్కి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ జీవితంలో ఒక లోటు మాత్రమే మిగిలిపోయింది.

 

అదేమిటంటే మొదటి కుమారుడు జన్మించిన సమయంలో ఎంతో సంతోషపడిన ఎన్టీఆర్ రెండవసారి కూడా బాబు జన్మించడంతో చాలా బాధపడ్డాను అని గతంలో చాలాసార్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. లక్ష్మీ ప్రణతికీ,ఎన్టీఆర్ కీ ఇద్దరికీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ రెండవసారి అమ్మాయి పుడుతుందని చాలా కలలు కన్నారట ఎన్టీఆర్. కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టడంతో మరీ అబ్బాయి పుట్టారని లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ ఇద్దరు బాధపడ్డారట. ఇలా ఎన్టీఆర్ కి కూతురు లేదనే బాధ ఇప్పటికీ ఉంది ఇలా కూతురు కావాలనే తన భార్య కోరిక ఎన్టీఆర్ తీర్చలేకపోయారట. పిల్లల విషయంలో తమకు కూతురు లేరు అనే లోటు అలాగే మిగిలిపోయిందని ఇలా ఆ బాధ తమకు ఇప్పటికీ ఉందని ఎన్టీఆర్ ఇప్పటికే చాలా సందర్భాలలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -