TDP: ఏపీలో టీడీపీ గాలి వీస్తోందా.. కారణాలు ఇవేనా?

TDP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. అధికార పార్టీలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో కూడా తమ జెండా ఎగరవేయబోతున్నాము అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఊహించని రీతిలో టిడిపి మూడు స్థానాలలో గెలవడంతో తెలుగుదేశం పార్టీ అధినేతలు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఏపీలో టీడీపీ గాలి వీస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా చదువుకున్న వారందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ టిడిపి ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నారని అందుకు ఉదాహరణగా భావించవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి పథకాలు అన్నింటినీ ప్రజలకు అందజేస్తున్నారు. కులం మతం పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన అందరికీ ఈయన సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు.

 

అయితే ఈ సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడుతుండడం గమనార్హం. కేవలం సంక్షేమ ఫలాలను అందిస్తే ప్రజలు తన తరపున నిలబడతారని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారని అయితే ఇది తన పార్టీకే ప్రమాదకరంగా మారిందని తెలుస్తోంది. ఇక ఇన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడంతో జగన్ అందించే సంక్షేమ ఫలాలు అంత చెత్తగా ఉన్నాయా అని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

 

ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో జనసేనతో కలిసి పొత్తుకు కుదుర్చుకున్నారు. ఇలా జనసేన పార్టీతో కలిసి టిడిపి ఎలాగైనా అధికారం అందుకోవాలని కృషి చేస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఆశలకు మరింత ఉత్తేజాన్ని కల్పించాయని పలువురు భావిస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సైతం ఎమ్మెల్యేల పనితీరు పైపెద్దగా పెద్ద దృష్టి పెట్టలేదు. ఇలా గాడి తప్పిన ఎమ్మెల్యేల పనితీరు ఆయన పార్టీకి ప్రమాదకరంగా మారుతుంది.ఇక ఈయన రాజధానుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఆయనకు ప్రమాదకరంగా మారిందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇప్పటికైనా మేల్కొని వచ్చే ఎన్నికలపై కాస్త దృష్టి సారిస్తే తిరిగి ఈయన అధికారంలోకి వచ్చే అవకాశాలు కొంతైనా ఉంటాయని లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికార పీఠాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: చంద్రబాబు దూకుడు మామూలుగా లేదుగా.. రోజుకు మూడు సభలతో అలా ప్లాన్ చేశారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పలమనేరులో ప్రజా గళం పేరిట ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -