TDP: టీడీపీకి ఈ నియోజకవర్గాల్లో ఓటమి తప్పదా? ఎందుకంటే?

TDP: ఏపీలో రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలే గెలుపు లక్ష్యంగా అప్పుడే జోరు పెంచేశాయి. ఈ క్రమంలో వైసీపీ ఏకంగా అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలవాలని టార్గెట్ గా పెట్టుకోగా.. జనసేన ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ దూసుకెళుతోంది. ఇక అధికారానికి దూరమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. పార్టీలో కలుగుతున్న ఇబ్బందులను తెలుసుకుంటూనే, వాటికి పరిష్కారాలను కూడా కనిపెట్టే పనిలో పడ్డారు. అయితే టీడీపీ గెలుపులో ఏర్పడిన ప్రధాన సమస్య.. ఒక్కో నియోజకవర్గం నుండి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుండటం. ఒక్కో నియోజకవర్గం నుండి ఒకటి కన్నా ఎక్కువ మంది టీడీపీ నేతలు ఎన్నికల బరిలో నిలవాలని అనుకుంటూ ఉండటం పార్టీకి తలనొప్పిగా మారింది.

వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటి పరిస్థితిని తీసుకువస్తుండగా.. ఎక్కువ మంది నేతలు పోటీకి సిద్ధమవుతుండటం పార్టీని ఇబ్బందిపెట్టే అంశం. నియోజక వర్గాలకు ఇంఛార్జీలు లేని నియోజకవర్గాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. గుంటూరు, ప్రకాశం, అనంతపురంతో సహా పలు జిల్లాలో టీడీపీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీటును టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జ్ పేరు ప్రకటన సమయంలోనే నానా గలాటా జరిగిన ఈ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎవరిని బరిలోకి దించుతారని, టికెట్ ఆశిస్తున్న మిగిలిన ఇద్దరిని ఎలా సముదాయిస్తారనే చర్చ నడుస్తోంది. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ టీడీపీలో తీవ్ర వర్గ పోరు ఉండగా.. మొన్నీ మధ్యన జరిగిన సమావేశంలో ఏకంగా కుర్చీలు విసురుకోవడం వార్తల్లో నిలిచింది.

ఇక ప్రకాశం జిల్లా కందుకూరులో టీడీపీలోనే మూడు గ్రూపులు ఉన్నాయి. ఇలా గ్రూపులుగా విడిపోయిన టీడీపీ నాయకులు.. పార్టీ గెలుపు కన్నా ప్రత్యర్థి గ్రూప్ అభ్యర్థి ఓడిపోవాలని పని చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉండగా.. దీని వల్ల పార్టీ ఓడిపోతుందని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. పార్టీలో గ్రూప్ తగాదాలు సెటిల్ చేయకుండా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే మాత్రం పార్టీ ఓడిపోవడం ఖాయమని.. కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న పోటీ సీట్ల సంఖ్య మీద, దాంతో అధికారం దక్కే లేదంటే చేజారే అంశాన్ని ప్రభావితం చేయనుందని పచ్చ తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -