Bigg Boss: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు పెళ్లి అయ్యిందా? ఫోటో వైరల్

Bigg Boss: వినోదానికి, వివాదాలకు కేరాఫ్ అయిన బిగ్ బాస్ గురించి రోజూ ఏదోక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ అయిన ఇనయా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. బోల్డ్ లేడీగా ఈ షోలో ఆమె ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఎదురున్న ఎంతమందినైనా ఆమె ఎదుర్కొన్నారు. ఆమె పోరాటం చూసి హౌస్ మొత్తం టార్గెట్ చేశారు. అయినా ఆత్మవిశ్వాసంతో ఇనయా గేమ్ ఆడుతూ వచ్చారు. బిగ్ బాస్ షోలో ఆమె ఫేక్ గేమ్ కు దూరంగా ఉంటూ వచ్చారు. బాధనా, ప్రేమైనా, కోపమైనా, నవ్వైనా ఆమె షోలో వెంటనే చూపించేవారు.

 

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ సూర్య అంటే తనకు ఎంతో ఇష్టమని అందరి ముందే ఇనయా తెలిపారు. ఆ తర్వాత అతనితో జతకట్టారు. షోలో ఇద్దరూ రొమాన్స్ చేశారు. అయితే సూర్యపై ఇష్టమే ఆమెను గేమ్ నిర్లక్ష్యంగా ఆడేలా చేసిందని తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున ఇనయాకు వార్నింగ్ ఇవ్వడంతో ఆ తర్వాత గేమ్ పై ఆమె ఫోకస్ పెట్టారు.

 

ఈ సీజన్ లో ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచారు. టాప్ 5లో కూడా ఉంటారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఇనయను 14వ వారం ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ ఆశ్చర్యపరిచారు. ఆదిరెడ్డి, ఇనయా ఇద్దరూ డేంజర్ జోన్లోకి వచ్చారు. దీంతో ఆ సమయంలో తక్కువ ఓట్లు వచ్చినటువంటి ఇనయాను ఎలిమినేట్ చేయడం అనివార్యమైంది.

 

బిగ్ బాస్ నుంచి ఇనయా ఎలిమినేషన్ అవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఫేక్ ఎలిమినేషన్ చేశారంటూ ఫ్యాన్స్ ధ్వజమెత్తారు. ఓట్ల ఆధారంగానే ఎలిమినేట్ చేశామంటూ నాగార్జున అందరికీ వివరణ ఇచ్చారు. మూడు నెలల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇనయా షో నుంచి బయటకు రాగానే తన క్రష్ సూర్యను కలిసి సందడి చేసింది. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితం ఇనయాకు పెళ్లైందనే వార్త వినిపిస్తోంది. ఇనయాకు చెందిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు6 అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆ త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఈ తరుణంలో గతంలో ఇనయాకు పెళ్లి జరిగిందని కొందరు అంటూ ఉండగా మరికొందరు మాత్రం ఆధారాలు లేకుండా ప్రచారం చేయొద్దని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -