Cinemas: ఈ హీరోల సినిమాలకు నష్టాలు రావడానికి ఆ పద్ధతే కారణమా?

Cinemas: ఒకప్పుడు ఒక సినిమాని విడుదల చేయాలి అంటే నిర్మాతలు పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు సినిమాలను అమ్మి విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలు కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. సినిమాలను హోల్ సేల్ గా అమ్మే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు.అయితే నిజంగానే సినిమాలను ఇలా హోల్సేల్ గా అమ్మేస్తున్నారా లేకపోతే ఆ సినిమాకి మార్కెట్ రావడం కోసం ఇలా చేస్తున్నారా అనే విషయం తెలియడం లేదు.

 


ఇలా హోల్ సేల్ విధానాన్ని అమలులోకి తీసుకురావడం వల్ల నిర్మాతలు లాభ పొందడం ఏమో కానీ హీరోలకు మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుందని తెలుస్తోంది. ఉదాహరణకు దసరా సినిమాను 24 కోట్లకు హోల్ సేల్ గా అమ్మేసారు. వాళ్లు మారు బేరాలు చేసి ఆఖరికి అది రెండు తెలుగు రాష్ట్రాలకు 30 కోట్ల మేరకు చేరుకుంది. ఇక ఈ సినిమా ఈస్ట్, వైజాగ్, నైజాం ఏరియాలలో మినహా ఇతర ప్రాంతాలలోని బయ్యర్లకు తీవ్రమైన నష్టాలను తీసుకువచ్చింది.

 

ఇలా బయ్యర్లకు తీవ్రమైన నష్టాలు రావడంతో నా అనే సినిమా వల్ల బయ్యర్లు నష్టపోయారని వార్తలు తెరపైకి వచ్చాయి. ఇలా హీరోలకు చెడ్డ పేరు వస్తుందనే చెప్పాలి. ఇలా హోల్ సేల్ విధానం ద్వారా కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ కాకపోవడంతో సినిమా ఫ్లాప్ అవుతుందంటూ హీరోలు అనవసరంగా ప్లాట్ ను మూట కట్టుకోవాల్సి వస్తుంది.ఇక రేపు విడుదల కాబోతున్న సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా అలాగే అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా ఈ విధమైనటువంటి హోల్ సేల్ మార్కెట్ జరుపుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ హీరోలకు ఈ విధానం ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

 

ఇక కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ కిరణ్ అబ్బవరం మీటర్ వంటి సినిమాలను కూడా మేకర్స్ హోల్ సేల్ విధానంలో అమ్మేశారు. ఇలా ఈ సినిమాలను కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడంతో మైత్రి మూవీ మేకర్స్ వారికి చెడ్డ పేరు వచ్చింది.ఈ విధానాన్ని మానుకుంటే సినిమా నిర్మాతలకు మంచి పేరు రావడమే కాకుండా హీరోలు కూడా ఈ విధమైనటువంటి ఫ్లాప్ మూట కట్టుకోవాల్సిన పని ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -