Rare Disease: మాధవీలత పెళ్లి చేసుకోకపోవడానికి ఆ వ్యాధి కారణమా?

Rare Disease: నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనటువంటి మాధవి లత అనంతరం స్నేహితుడా వంటి సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతో రాజకీయాలలోకి వెళ్లిన మాధవి లత రాజకీయాలలో కూడా కొంతకాలం పాటు చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాలకు కూడా ఈమె కాస్త దూరంగా ఉన్నారని చెప్పాలి.

ఇలా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను మాత్రమే కాకుండా సినీ రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోని తాజాగా ఈమె పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ తాను పెళ్ళికి సిద్ధంగా లేనని విషయాన్ని తెలియజేశారు.

 

సాధారణంగా పెళ్లి వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నతో విసిగిపోయిన మాధవి లత పెళ్లి పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.పెళ్లి చేసుకోవాలి అంటే వయసు ఒకటే ఉంటే సరిపోదు అని తెలిపారు. వయసుతో పాటు ఆ వ్యక్తి పెళ్లికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలని ఈమె తెలియజేశారు. అయితే ప్రస్తుతం తాను పెళ్ళికి సిద్ధంగా లేనని మాధవి లత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

పెళ్లి గురించి కొన్ని విషయాలను తెలియచేయడమే కాకుండా ఈమె ఒక వింత సమస్యతో బాధపడుతున్నానని కూడా తెలిపారు.తాను మైగ్రేన్ తలనొప్పితో చాలా బాధపడుతున్నానని బయటికి నవ్వుతున్నంత మాత్రాన తనకు ఎలాంటి సమస్యలు లేవనుకోవడం పొరపాటున తెలిపారు.ఈ సమస్య నుంచి బయట పడటం కోసం తాను టాబ్లెట్స్ వేసుకున్నానని అయితే అలాగే వేసుకుంటూ పోతే చివరికి అవి పనిచేయకుండా పోతాయన్న ఉద్దేశంతోనే తాను నేచురల్ గా ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా మాధవి లత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -