Yamuna: యమునను బుక్ చేసింది ఆ వ్యక్తేనా.. అందుకే ఇలా చేశారా?

Yamuna: హీరోయిన్ యమున అంటే అప్పట్లో ఎమోషనల్, ఏడుపు పాత్రలకు పెట్టింది పేరు. కేవలం యమున కోసమే సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు అప్పట్లో ఉన్నారు. ముఖ్యంగా మామగారు, సూరిగాడు లాంటి సినిమాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వెండితెరపై హీరోయిన్ గా అలరించిన తర్వాత ఈటీవీ విధి సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమె ప్రయాణం ఆగలేదు.

 

ఈటీవీలో ఆమె రెండు మూడు పాపులర్ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. విధి సీరియల్ లో ఆమె పండించిన అభినయానికి తెలుగు మహిళా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే ఇప్పటికీ య‌మున‌ను అభిమానించే వాళ్ళు తగ్గలేదు. కెరీర్ పరంగా మంచి పిక్ స్టేజ్ లో ఉండగానే ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది.

 

2011లో బెంగళూరులో ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఉండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారన్న‌ వార్త బయటకు రావడంతో పెద్ద సంచలనం రేగింది. అప్పటి నుంచి య‌మున కెరీర్ ఒక్క‌సారిగా డౌన్ అయిపోయింది. ఆ తర్వాత చాలా రోజులపాటు ఆమె ఎవరికీ కనిపించలేదు. ఇక ఇటీవల కాలంలో యమున‌ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా వేదిక ద్వారా తన సినిమా అనుభవాలు తన అనుభవాలు పంచుకుంటుంది.

 

అప్పటి సినిమా ముచ్చట్లు కూడా చెబుతోంది. ఈ క్రమంలోనే తనపై వ‌చ్చిన వ్యభిచారం కేసు గురించి ఆమె క్లారిటీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన ఆ విషయంలో తన తప్పేమీ లేదని, కావాలని తనపై కొందరు కుట్ర చేసి ఇరికించారని చెప్పింది. న్యాయస్థానం సైతం ఈ విషయంలో తనకు క్లీన్ చీట్ ఇచ్చిందని, తన తప్పేమీ లేదని చెప్పిందని అయినా కూడా కొందరు ఇప్పటికీ సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారు అంటూ వాపోయింది.

అసభ్యకరమైన తంబ్‌నైల్స్‌ తో మానసికంగా హింసిస్తున్నారని, తాజాగా ఆమె ఓ వీడియో ద్వారా తన బాధను వ్యక్తం చేసింది. ఆ రోజు అసలు ఏం జరిగిందో ఎప్పటికే చాలా ఇంటర్వ్యూల‌లో చెప్పేసాను. న్యాయస్థానం సైతం తన తప్పు లేదని చెప్పినా, సోషల్ మీడియా మాత్రం తనను పదేపదే గుచ్చి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత మోటివేట్ చేసుకుందాం అనుకున్నా, తాను కూడా మనిషినే అని ఒకవేళ తాను చనిపోయిన కూడా వీళ్లు నన్ను వదలరు అని తన బాధను ఆ వీడియోలో వ్యక్తం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -