Constructed House: కొత్త ఇంట్లో అలా జరిగితే వాస్తు దోషం అంటారు నిజమా?

Constructed House: మనం కొత్తగా ఇల్లు నిర్మించినప్పుడు వివిధ కారణాల వల్ల గోడలకు పగుళ్లు, స్లాబు కూలిపోవడం జరుగుతుంటుంది. అలా జరిగినప్పుడు చాలా మంది ఇలా జరగడానికి వాస్తుదోషం ఉంటారు. అది ముమ్మటికి తప్పు. నిజానికి వాస్తు ఔన్నత్యం గురించి తెలిసిన వాళ్లు అలా మాట్లాడారు. గోడలకు నిలువుగా, అడ్డంగా పగుళ్లు వస్తే అది నిర్మాణ లోపమే ఉంటుంది కానీ.. ఎలాంటి వాస్తుదోషం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

పునాది సమతుల్యంగా లేకపోవడం, బేస్‌మెంట్‌ మీద ఫ్లింత్ భీమ్ వేయకుండా కడితే నిలువు పగుళ్లు వస్తాయి. వాటితో పాటు క్యూరింగ్ కూడా సరిగ్గా లేకపోవడంతో అడ్డం పగుళ్లు వస్తాయి. కాబట్టి నిర్మాణ లోపాలను వాస్తు దోషాలుగా పరిగణించకూడదంటున్నారు. ఇంకో విషయమేమిటంటే సెంట్రింగ్ సరిగ్గా లేకపోతే కూలీల బరువుకు కూడా స్లాబు కూలిపోయే ‍్రమాదం ఉంటుంది.

మరికొందరిలో స్లాబును ఈశాన్యం వైపు ఒంపుచేసి వేయవచ్చా లేదా అని సందేహాలు తలెత్తుతాయి. ఇది కూడా తప్పంటున్నారు. ఈశాన్యం వైపు నీరు పోవాలి కదా అనే ఉద్దేశంతో స్లాబునే కొన్ని అంగుళాలు ఒంపు చేసి వేయడం నిర్మాణ పటిష్ఠతకు భంగం తెస్తుంది. సెంట్రింగ్ సమంగా బిగించి ఎత్తు ఒంపులు లేకుండా కట్టుకొని దానిమీద సూచించిన మందంతో (నాలుగున్నర లేదా ఐదున్నర అంగుళాలు) స్లాబ్ చేయాలి. స్లాబ్ కర్రలు (సెంట్రింగ్) తొలగించిన తరువాత, పైన మళ్లీ స్లాబును లాగడం అంటూ సరి చేస్తారు.

అప్పుడు ఈశాన్యం దిశకు వాలుగా చేసుకోవచ్చు. దీని ద్వారా వాడిన నీరు, వర్షం నీరు ఇంటి ఈశాన్యం వైపు వెళ్తాయి. పిరమిడ్ కప్పులు, ఇతరత్రా వాలు నిర్మాణాలు చేసినప్పుడు నీరు పారే విధానం వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి స్లాబును ఇష్టానుసారంగా వేయరాదంటున్నారు నిపుణులు. ఒకప్పుడు త్రిభుజాకారం జోలికే వెళ్లేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు వంకర టింకర స్థలాల్ని కూడా వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ త్రిభుజాకార స్థలానికి ఉత్తరం వీధి ఉంది కాబట్టి, నిర్మాణానికి కొంత అవకాశం ఉంది.

దానిలో ఉత్తరం ప్రధాన అంచుగా భుజం తీసుకుని దానిని అనుసరించి ఒక చతురస్రం.. దీర్ఘ చతురస్రం కానీ వచ్చేలా స్థలాన్ని ఎంచుకోవాలి. అది మార్క్ చేసుకొని మిగతా స్థలం ఎన్ని ముక్కలుగా వచ్చినా సరే, దానిని వదిలివేయాలి. అందులో మళ్లీ ఏదో కడదాం అనే ఆలోచనను విరమించుకోవాలి. మంచి మట్టితో, కుదిరితే ఎర్రమట్టి, మొరంతో ఇంటి బరంతి నింపాలి బంకమన్ను, ఎముకలు, వెంట్రుకలు ఉన్న మట్టి, చెరువు మట్టితో నింపవద్దు. భరంతిని ఒకేసారి నింపేస్తే ఓ పనై పోతుందని అనిపించుకోవద్దు. సగం ఓ రోజు, మిగతా సగం మరో రోజు నింపాలి. దానిని చదునుగా చేసి ఎగుడు దిగుడు లేకుండా చేసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -