Girls After Marriage: ఆ కారణం వల్లే పెళ్లి తర్వాత అమ్మాయిలు లావు అవుతారా?

Girls After Marriage: సాధారణంగా చాలామంది పెళ్లయిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిలలో చాలా రకాల మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా పెళ్లి తర్వాత చాలామంది పురుషులు స్త్రీలు లావు అవుతుంటారు. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువగా లావు అవుతూ ఉంటారు. మరి పెళ్లి తర్వాత స్త్రీలు ఎక్కువ లావు అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పెళ్ళికి ముందు చాలా మంది లావుగా ఉండే అబ్బాయిలు అమ్మాయిలు వివిధ రకాల వర్కౌట్లు చేసి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అలాగే స్లిమ్ అవడం కోసం ఎన్నో రకాల డైట్లు కూడా ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది పెళ్లి తర్వాత ఎక్కువగా నూనె మసాలాలు పంచదార మైదా వంటి పదార్థాలతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పెరిగి లావు విపరీతంగా పెరుగుతారు.

 

అలాగే పెళ్లి సమయంలో పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు నుంచి ఫంక్షన్ లు చుట్టాలు రావడం వల్ల వారితో టైం స్పెండ్ చేస్తూ సరిగా నిద్రపోవడానికి సమయం ఉండదు. కొత్త జంట చాలా వరకు అలసిపోయి నిద్రకు పూర్తిగా భంగం కలిగి, ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడి కాస్త ఉబ్బినట్లు కనిపిస్తారు. పెళ్లి తర్వాత చాలామంది సెక్స్ లో పాల్గొనడం వల్ల వారి శరీర హార్మోన్ లో మార్పులు వస్తాయి. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే బరువు పెరగచ్చు.

 

అలాగే కొంతమంది మహిళలు వివాహం తర్వాత ఆందోళన, మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీరు ఎప్పుడూ ఏదో ఒక దానిపై నిమగ్నమై ఉంటారు . దీనివల్ల మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల రోజులు గడుస్తున్న కొద్ది బరువు పెరిగి ఉబకాయం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది సెక్స్ లో పాల్గొనడం వల్లే బరువు పెరుగుతారని అనుకుంటూ ఉంటారు. కానీ బరువు పెరగడానికి సెక్స్ ఒకటే కారణం అనుకోవడం పొరపాటు.

Related Articles

ట్రేండింగ్

TV Channels: టీవీ9, ఎన్టీవీ నంబర్ 1 కొట్లాట.. ఏది టాప్ అంటే?

TV Channels: తెలుగు న్యూస్ ఛానల్ మధ్య నెంబర్ గేమ్ నడుస్తుంది. పలు న్యూస్ ఛానల్ మేము నెంబర్ వన్ అంటే మేము నెంబర్ వన్ అని కొట్లాడుకుంటున్నారు. తెలుగు న్యూస్ చానల్స్...
- Advertisement -
- Advertisement -