Movies: లైగర్ ఏజెంట్ సినిమాలు అందుకే డిజాస్టర్లు అయ్యాయా?

Movies: సరిగ్గా 10 నెలల క్రితం పూరి జగన్నాధ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయాన్ని సంపాదించుకున్న లైగర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా 2022లో ఒక పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దర్శకుడు పూరి జగన్నాథ్ కి నిర్మాత చార్మికి కథానాయకుడు విజయ్ దేవరకొండ కి తీరని గాయం మిగిల్చింది.

అయితే అంతటి పరాజయానికి కారణం సినిమా కథనం అని చెప్పుకోవాలి. మళ్ళీ పది నెలల తర్వాత సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నిర్మించిన ఏజెంట్ సినిమాకు అదే గతి వచ్చింది. భారీ అంచనాలతో ఈ శుక్రవారం ఏజెంట్ సినిమా విడుదల అయింది.

 

అయితే ఈ సినిమా విడుదలకు ముందే అఖిల్ లుక్స్, సిక్స్ ప్యాక్స్ అలాగే ఇతర భాషలలోని అగ్రనటులు ఈ సినిమాలో నటించడం వల్ల విపరీతమైన హైప్ ఏర్పడింది. చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాగా ప్రేక్షకులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమాకి సరైన కథ లేకపోవడమే కాక మ్యూజిక్ కూడా మైనస్ అయింది.

 

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రథౌలా కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించడం తో సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ భారీ అంచనాలే చిత్రానికి మైనస్ పాయింట్ గా నిలిచింది.కథలు ఎంచుకోవడంలోనే అఖిల్ తప్పు చేస్తున్నాడు.

 

తలా తోక లేని కథని ఎంచుకొని దానికోసం కష్టపడడం కన్నా ఒక మంచి కథను ఎంచుకొని కెరీర్ ని మంచిదారిలో తీసుకెళ్ళమని సలహాలు ఇస్తున్నారు ప్రేక్షకులు. సురేందర్ రెడ్డి కెరీర్ లో తీసిన అతి దరిద్రపు సినిమాల్లో కిక్ 2 ఒకటి కాగా ఆ లిస్టులో ఏజెంట్ సినిమా కూడా చేరింది. అయితే ఇప్పటికైనా అఖిల్ కథలు ఎంచుకునే తీరు మార్చకపోతే తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -