Karnataka CM: జేడీఎస్ బలం ప్రతి ఎన్నికలలోనూ అంతకంతకూ తగ్గుతూనే వస్తోంది. కాగా గత లోక్ సభ ఎన్నికలలో జేడీఎస్ మొదటి ఫ్యామిలీ అభ్యర్థులే ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మండ్య నుంచి కుమారస్వామి తనయుడు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. దాంతో ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్ బలం తగ్గిపోతుందది అంటూ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అంతే కాకుండా ఆ పార్టీకి మహా అంటే పాతిక సీట్లు దక్కవచ్చని ప్రీ పోల్, పోస్ట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. జేడీఎస్ పార్టీ బలం తగ్గిపోతున్న కూడా కుమారస్వామికి సీఎం అవకాశాలు మాత్రం మిస్ అవ్వడం లేదు.
ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ వాళ్లు వెంటపడి మరి కుమారస్వామిని సీఎంగా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. బీజేపీ గద్దెనెక్కపోతే చాలు అనే లెక్కలతో కుమార స్వామిని కాంగ్రెస్ వాళ్లు దగ్గరుండి మరి సీఎం ని చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కొన్నాళ్లు కాపాడగలిగారు. అయితే అప్పుడు దాదాపు ఏడాదిన్నర పాటు కుమారస్వామి కర్ణాటక సీఎంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అది కుమార స్వామికి రెండవ అవకాశం. అంతకు ముందు బీజేపీ వాళ్లు ఆయనను ఒకసారి రెండున్నరేళ్ల పాటు సీఎం సీట్లో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాటు ఆయనను సీఎంగా కూర్చోబెట్టింది.
మరి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి విడదలైన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే కుమారస్వామి మరో సారి మహర్జాతకుడు అయినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు పార్టీల్లో వేటికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు మినిమం మెజారిటీ అని రెండు మూడు సర్వేలు చెబుతున్నాయి. మిగతావి మాత్రం కాంగ్రెస్ పెద్ద పార్టీ గా నిలవొచ్చు.. బట్ హంగ్ అంటున్నాయి. మరి అలాంటి పరిస్థితి వస్తే 20 నుంచి 30 మధ్య ఎమ్మెల్యేల బలాన్ని జేడీఎస్ సంపాదించుకుని కింగ్ మేకర్ కావడం ఖాయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కుమారస్వామికి మరోసారి సీఎం పదవి వచ్చే అవకాశాలు విన్నట్టు తెలుస్తోంది..