YCP: అభివృద్ధి చేయకపోవడమే వైసీపీకి శాపమా.. సీట్లు తగ్గుతున్నాయా?

YCP: రాజన్న రాజ్యస్థాపనే లక్ష్యంగా 2019 ఎన్నికల్లో ప్రచారం చేసి గెలుపొందారు వైసీపీ అధినేత జగన్. ఆ తర్వాత రాజన్న పాలన మాత్రం ఎక్కడా చూపించలేదని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. పైగా రాక్షస పాలనను తెచ్చాడని మండిపడుతున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఎక్కడా అభివృద్ధి అనే మాటే వినిపించటం లేదని వైసీపీ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఇప్పుడంతా సర్వేల కాలం నడుస్తోంది. అదేదో భూ సర్వేలు లేక ఆర్థిక సర్వేలు కాదండి.. రాజకీయ పార్టీల సర్వేలు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తోంది. ప్రజలకు ఎవరికి అనుకూలంగా ఉన్నారనే దానిపై సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎప్పటి నుంచో ఐ ప్యాక్ అనే సంస్థను నమ్ముకుని, ఆ సంస్థ ద్వారా సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మాత్రమే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. నవరత్నాలనే ప్రోగ్రాం తెచ్చి, అందులోని పథకాలను ఇస్తోంది. ఇందులో పూర్తిగా అమలు కావటం లేదు. మరోవైపు ఈ పథకాలన్ని కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. వాటిలోనూ కోతలు విధిస్తున్నారు. పన్నులు మాత్రం విపరీతంగా పెంచేశారని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా రాలేదని యువత విమర్శిస్తోంది. రోడ్లు వేయలేదు, గ్రామాలు అభివృద్ధి చేయలేదు, రాజధాని కట్టలేదని ప్రజలు అనుకుంటున్నారు. అన్నీ సీట్లు గెలిపించినా, జగన్ చేసిందేమి లేదంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓడించాలని మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో జగన్ కు 30 సీట్లకు మించవని సర్వేలు చెబుతున్నాయి. ఇక దుకాణం సర్దుకోవాల్సిందేనని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: కుప్పంలో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాలివే.. ఎదురుగాలి వీస్తోందని అలా చేస్తున్నారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజా గళం పేరిట పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుప్పంలో...
- Advertisement -
- Advertisement -