Milky Beauty: మిల్కీ బ్యూటీ వ్యభిచారి కాబోతుందా.. మరో అలియా అంటూ?

Milky Beauty: మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య ఏ సినిమా చేసినా నామరూపం లేకుండా పోతోంది. తాజాగా తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం అనే సినిమా వచ్చిందనే విషయం చాలా మందికి తెలీదు. ఈ సినిమా ఎవ్వరికీ గుర్తు కూడా లేకుండా పోయింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశారో డైరెక్టర్ కు అయినా తెలుసా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో తమన్నా అందాలు ప్లస్ గా ఉన్నా, హీరో సత్యదేవ్ నటన అద్భుతంగా ఉన్నా కథలో కంటెంట్ లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అంతకుముందు ఈమె బాలీవుడ్ లో చేసిన బబ్లీ బౌన్సర్ అనే సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యిందనే చెప్పాలి.

 

తాజాగా తమన్నా ఇక తనకి హిట్లు రావని డిసైడ్ అయిపోయింది. దీంతో తమన్నా సరికొత్త కంటెంట్ కథలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఓ క్రేజీ సినిమాకి సైన్ చేసినట్లు సమాచారం. ఇదొక వాస్తవిక కథ ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో అయినా తమన్నా మళ్లీ ఫామ్ లోకి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. తమన్నా కూడా దీనిపై ఎక్కువ ఆశ పెట్టుకుందట.

కొత్త సినిమాలో తమన్నా బ్రోతల్ హౌస్ నడిపే ఉమెన్ గా కనిపించనుందటనే టాక్ వినిపిస్తోంది. డబ్బు కోసం ఆడవాళ్లను ఎలా శారీరకంగా హింసిస్తారు అనేది ఈ సినిమా కథ. వ్యభిచారం చేసే ఆడవాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పనులు చేస్తారో తెలిపే కథగా ఓ మెస్సేజ్ ఓరియెంటెడ్ తో ఈ సినిమా రానుంది. తమన్నా ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకుందట.

 

ఈ మధ్యనే అలియా భట్ సైతం గంగుభాయ్ కతీయవాడి అనే సినిమాలో ఇలాంటి పాత్రనే చేసింది. ఆ సినిమా ద్వారా ఆమె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె బాటలోనే తమన్నా వెళ్లనుంది. తమన్నా డేరింగ్ స్టెప్ బావుందని పలువురు ఆమెను ఆశీర్వదిస్తుంటే మరికొందరేమో ఇది కూడా డిజాస్టరే ఏమోనని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -