NBK 108: ఎన్బీకే108 మూవీ అలా ఉండబోతుందా.. పోస్టర్ బాగుంది కానీ?

NBK 108: టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమా లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇది ఇలా ఉండే ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండుగ కానుకగా బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.

కాగా వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు తండ్రి కొడుకుల పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. మామూలుగా అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే కామెడీ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ ఉంటారు. మరి బాలయ్య బాబు కూడా ఈ సినిమాలో కామెడీ పాత్రలో నటించనున్నారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

 

బాలయ్య బాబు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మాస్, అలాగే యాక్షన్. కానీ బాలయ్య బాబు నుంచి ప్రేక్షకులు కామెడీ సినిమాను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కామెడీ సినిమాలలో బాలయ్య బాబు నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. బాలయ్య బాబు అందులో ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించడంతో సోషల్ మీడియా ట్రోలర్స్ ఆ ఫోటోపై కొన్ని మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ మీమ్స్ ఏవో ఒకసారి తెలుసుకుందాం.. ఏదో తక్కువ అయింది అని రాయగా మరో ఫోటోపై ఆ నరకుడు, సంపుకోడాలు కాకుండా కొంచెం మంచిగా తియ్యనా అని అనిల్ రావిపూడి అనుకుంటున్నట్లుగా మీమ్ క్రియేట్ చేశారు. పండగ చేసుకోండి, జై బాలయ్య, పరం వీర చక్రమ్, ఊ కొడతారా ఉలిక్కి పడతారా లుక్స్ గుర్తుకొస్తున్నాయి ఏంటి అంటూ రక రకాల మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -