CM Jagan: ఏపీలో టీడీపీ పుంజుకోవడం సీఎం జగన్ ను బాధ పెడుతోందా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు చాలా హాట్ హాట్ గా కొనసాగుతూ ఉంటాయి.తండ్రి మరణం తర్వాత సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా అధికార పీఠాన్ని అందుకోవాలని ఎంతో తప్పించారు.ఇలా ఈయన అనుకున్నట్టుగానే ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా కల్పించారు.

ఇలా ప్రజలకు భరోసా కల్పించడంతో ఈయనని నమ్మిన ప్రజలు ఆయనకు గత ఎన్నికలలో ఏకంగా అద్భుతమైన విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయనకు పట్టాభిషేకం చేశారు.ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈయన కులాం, మతం అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించారు.అయితే వచ్చే ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది.

 

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఏపీలో కాస్త పుంజుకోవడంతో వైసిపి అభ్యర్థులు అలర్ట్ అయ్యారు.

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ కాస్త పుంచుకోవడం కనిపించింది. దీంతో వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా టిడిపి ప్రభుత్వం అధికారాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడుకు అమ్మడు పోవడంతో వచ్చే ఎన్నికలలో జగన్ గెలుపు అసాధ్యం అంటూ పలువురు భావిస్తున్నారు. అయితే జగన్ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకొని వ్యక్తి కాదు.

ప్రస్తుతం సీఎం జగన్ గాయపడిన సింహం అని సరైన సమయం వస్తే ఆయన మళ్లీ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో 151 సీట్లు గెలుపొందిన జగన్ ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ వచ్చే ఏడాది ఏకంగా 175 సీట్లను టార్గెట్ చేస్తూ గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఏపీలో టీడీపీ పుంజుకోవడం జగన్ ను హర్ట్ చేస్తోందని తెలుస్తోంది. ఇలా హార్ట్ అయినటువంటి జగన్ ఇకపై ఎన్నికలపై తన ఫోకస్ పెట్టబోతున్నారని, ఎలాగైనా తన టార్గెట్ చేరుకుంటారని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: భర్త పదవి భార్యకు ఇస్తున్న ఏపీ సీఎం జగన్.. ఈ ప్రయత్నాలు ఫలించే ఛాన్స్ ఉందా?

CM Jagan: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి సీఎం జగన్ లో కనిపిస్తుంది. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెంనాయుడు పోటీలో ఉన్న...
- Advertisement -
- Advertisement -