YCP: వైసీపీ పరిస్థితా ఇంత దారుణమా.. అసలేం జరిగిందంటే?

YCP: ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వానికి భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ ఉండేదని చెప్పాలి. ఇలా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏ ఒక్క కామెంట్ చేసిన తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో అభిమానులు వాటిని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టేవారు ప్రస్తుతం ఈ పార్టీ వ్యవహార శైలి కారణంగా సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ కార్యకర్తల సంఖ్య తగ్గిపోతుంది అని తెలుస్తుంది.

సోషల్ మీడియా వేదికగా వైసిపి మాజీ సైనికులు సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవ్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. సజ్జల భార్గవ ఇప్పుడు సోషల్ మీడియా సైనికులకోసం వెదుక్కుంటున్నారు. ఇందు కోసం నగరాల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో శ్యామ్ కలకడతో పాటు చచ్చిపోయిన మరో సోషల్ మీడియా వారియర్ ఫోటోకు సింగిల్ దండను సగం సగం వేస్తూ కవర్ చేస్తున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున స్పీచ్ లను ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ తాము లక్ష మంది సోషల్ మీడియాలో సైనికులను ఏర్పాటు చేసుకుంటామంటూ వెల్లడించారు ఇలా భార్గవ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ అసలు ఏంటి వైసిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో లక్ష మంది కూడా లేరా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఐదు లక్షల మంది ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ప్రభుత్వ వ్యవహార శైలి కారణమని తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పెయిడ్ కార్యకర్తలనే తెలుస్తోంది.ఇలా వైసిపి నాయకుల వ్యవహార శైలితో విసిగిపోయినటువంటి కార్యకర్తలు వైసిపికి పనిచేయడం కన్న తమ పని తాము చేసుకోవడం ఎంతో మంచిది అన్న ఉద్దేశంతో ఈ పార్టీ వ్యవహారాలను చూసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇక భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలతో ముచ్చటించాల్సి వచ్చిన ఆ కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

BJP: బీజేపీ కూటమికి బలం అవుతుందా.. బలహీనత అవుతుందా.. ఇంత దారుణమైన పరిస్థితులా?

BJP:  భారతదేశంలో బీజేపీ కి ఎంత బలం ఉన్నా తెలుగు రాష్ట్రాల వద్దకు వచ్చేసరికి బీజేపీ బలం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎక్కువ మద్దతు లేకపోవడంతో బీజేపీ తెలివిగా...
- Advertisement -
- Advertisement -